సమంత విడాకులు, దీపికా పదుకొనె బికినీపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్ళ పేర్లు చెబుతూ సరికొత్త వివాదం
చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదం జరిగినా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ నటి రమ్య అలియాజ్ దివ్య స్పందన సోషల్ మీడియాలో విమెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అంటూ సరికొత్త వివాదానికి తెరతీసింది.
చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదం జరిగినా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ నటి రమ్య అలియాజ్ దివ్య స్పందన సోషల్ మీడియాలో విమెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అంటూ సరికొత్త వివాదానికి తెరతీసింది. విమెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాన్స్ కోల్పోయే విధంగా ట్రోలింగ్ జరుగుతోంది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనికి కొన్ని ఉదాహరణలు పేర్కొంది. దివ్య స్పందన ట్వీట్ చేస్తూ.. 'సమంత విడాకులు తీసుకున్నందుకు ట్రోల్ చేశారు. సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పినందుకు ట్రోల్ చేశారు. రష్మిక బ్రేకప్ చేసుకున్నందుకు ట్రోల్ చేశారు. దీపికా పదుకొనె బికినీ వేసుకున్నందుకు ట్రోల్ చేశారు. ఇంకా చాలా మందిని పలు అంశాలపై ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి అంశంలో మహిళలే టార్గెట్ అవుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. మహిళలు అంటే దుర్గామాతకి ప్రతిరూపం. స్త్రీలపై ద్వేషాన్ని అరికట్టాలి అంటూ దివ్య స్పందన పేర్కొంది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నెటిజన్ల నుంచి దివ్య కామెంట్స్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు.. సామ్ పై పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఆ మధ్యన సాయి పల్లవి కూడా కాశ్మీర్ పండిట్ల నరమేధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. గోసంరక్షణ పేరుతో ఇప్పుడు కూడా అలాంటి పనులే చేస్తున్నారు అని సాయి పల్లవి పేర్కొనడంతో పెద్ద వివాదమే జరిగింది.
ఇక రష్మిక.. తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుంది. ఆ సమయంలో కూడా రష్మిక ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇప్పుడు దీపికా పదుకొనెపై, షారుఖ్ పఠాన్ చిత్రంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ చిత్రంలో దీపికా ధరించిన బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
వరుస వివాదాల్లో మహిళలే టార్గెట్ గా మారుతున్నారు అనే అర్థం వచ్చేలా దివ్య స్పందన ట్విట్టర్ లో పేర్కొంది. హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో దివ్య హీరోయిన్ గా మెరిసింది. ప్రస్తుతం రాజకీయ నేతగా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.