MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • మోహన్ బాబుతో అలాంటి సన్నివేశం, క్యారవ్యాన్ లో వెక్కి వెక్కి ఏడ్చిన టీనేజ్ హీరోయిన్..చివరికి ఏం జరిగిందంటే

మోహన్ బాబుతో అలాంటి సన్నివేశం, క్యారవ్యాన్ లో వెక్కి వెక్కి ఏడ్చిన టీనేజ్ హీరోయిన్..చివరికి ఏం జరిగిందంటే

మోహన్ బాబు విలన్ పాత్రలతో ఎంత గుర్తింపు పొందారో హీరోగా కూడా అదే స్థాయిలో రాణించారు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ లాంటి అద్భుతమైన చిత్రాలు మోహన్ బాబు కెరీర్ లో ఉన్నాయి. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ అద్భుతం అనే చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఒక సంఘటన జరిగింది. 

 

tirumala AN | Published : Apr 17 2025, 08:54 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Divya Bharti

Divya Bharti

మోహన్ బాబు విలన్ పాత్రలతో ఎంత గుర్తింపు పొందారో హీరోగా కూడా అదే స్థాయిలో రాణించారు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ లాంటి అద్భుతమైన చిత్రాలు మోహన్ బాబు కెరీర్ లో ఉన్నాయి. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ అద్భుతం అనే చెప్పాలి. డైలాగ్స్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన టైమింగ్. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఒక సంఘటన జరిగింది. 

 

25
Asianet Image

ఈ చిత్రంలో దివ్య భారతిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అప్పటికే బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో దివ్యభారతి పేరు టాలీవుడ్ లో మారుమోగుతోంది. అసెంబ్లీ రౌడీ చిత్రంలో నటించే సమయానికి దివ్య భారతి ఇంకా టీనేజ్ అమ్మాయే. ఆమె వయసు 17 ఏళ్ళు. బొబ్బిలి రాజాలో కంటే ఇంకా గ్లామర్ గా ఈ చిత్రంలో దివ్య భారతిని చూపించాలని డైరెక్టర్ బి గోపాల్ అనుకున్నారు. 

 

35
Asianet Image

దివ్యభారతిని అందంగా చూపించడం కోసం బాత్రూమ్ సన్నివేశం క్రియేట్ చేశారు. బాత్రూంలో అమ్మాయిని అలా చూపించవచ్చా అని మోహన్ బాబుతో ఎవరో అన్నారట. దీనితో మోహన్ బాబు ఆ సన్నివేశానికి అభ్యంతరం చెప్పారు. కానీ బి గోపాల్ కన్విన్స్ చేశారు. దివ్యభారతి గ్లామర్ తో పాపులర్ అయింది. ఆ అమ్మాయి బాత్రూమ్ లో ఎలాంటి డ్రెస్ వేసుకుంది అనేది ఎవరూ పట్టించుకోరు. అందంగా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు అని చెప్పారట. దీనితో మోహన్ బాబు ఆ సన్నివేశానికి ఒప్పుకున్నారు. 

 

45
Asianet Image

బాత్రూమ్ సన్నివేశం షూటింగ్ కి రెడీ అయ్యారు. ఆ సీన్ లో దివ్యభారతి స్విమ్ సూట్ లాంటి పొట్టి డ్రెస్ వేసుకోవాలి. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి దివ్యభారతి క్యారవ్యాన్ లో కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది అట. హీరోయిన్ ఎక్కడ అని బి గోపాల్ కో డైరెక్టర్స్ ని అడిగారు. ఆ అమ్మాయి ఏడుస్తోంది అని చెప్పడంతో ఆయన వెళ్లి చూశారు. నిజంగానే ఏడుస్తోంది. ఏమైంది అని అడిగితే నేను ఇలాంటి డ్రెస్ వేసుకోను అని చెప్పింది. చిన్న అమ్మాయి కదా భయపడింది అని బి గోపాల్ అన్నారు. 

 

55
Mohan babu

Mohan babu

నువ్వు ఇబ్బంది పడేలా సన్నివేశం ఉండదు అని బి గోపాల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. కానీ ఆమె ఏడుస్తూనే ఉంది. పక్కనే దివ్యభారతి తల్లి నేను పంపిస్తాను అని సైగ చేశారట. మరోవైపు సెట్ లో మోహన్ బాబు ఎదురుచూస్తున్నారు. ఎక్కడ తిడతారో అని బి గోపాల్ టెన్షన్ పడుతున్నారు. చివరికి వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పడంతో దివ్య భారతి ఆ సన్నివేశంలో నటించింది అని బి గోపాల్ తెలిపారు. ఈ చిత్రంతో దివ్య భారతి వరుసగా రెండో బ్లాక్ బస్టర్ అందుకుంది. 

 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
మంచు మోహన్ బాబు
 
Recommended Stories
Top Stories