MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్..భూమిక, నిత్యామీనన్ ఎలాంటి వారంటే.. నటి తీవ్ర వ్యాఖ్యలు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్..భూమిక, నిత్యామీనన్ ఎలాంటి వారంటే.. నటి తీవ్ర వ్యాఖ్యలు

చిత్ర పరిశ్రమ అంటే తరచుగా కాస్టింగ్ కౌచ్, అమ్మాయిలని మోసం చేయడం.. అదేవిధంగా మహిళా నటీమణులకు ఎదురయ్యే వేధింపుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 17 2024, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిత్ర పరిశ్రమ అంటే తరచుగా కాస్టింగ్ కౌచ్, అమ్మాయిలని మోసం చేయడం.. అదేవిధంగా మహిళా నటీమణులకు ఎదురయ్యే వేధింపుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. దీనిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. మీటూ ఉద్యమం సమయంలో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి అపూర్వ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నటి అపూర్వ వ్యాంప్ తరహా పాత్రలో ఇమేజ్ తెచ్చుకుంది. వ్యాంప్ పాత్రలు చేస్తూ కామెడీ రోల్స్ లో కూడా అపూర్వ నటించింది. 

 

37

తెలుగు హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వరు.. నార్త్ హీరోయిన్లు కమిట్మెంట్ కి ఒకే చెప్పేస్తారు అనే అభిప్రాయం టాలీవుడ్ లో ఉంది ఎంతవరకు నిజం అని యాంకర్ ప్రశ్నించింది. నటి అపూర్వ స్పందిస్తూ పర్టికులర్ గా దాని గురించి ఎలా చెప్పగలం. తెలుగు హీరోయిన్ అయినా, నార్త్ అయినా ఆ పాత్ర కచ్చితంగా తమకే కావలి అనుకుంటే కమిట్మెంట్ కి ఒకే చెబుతారు. 

47

ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే.. కమిట్మెంట్ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య అండర్ స్టాండింగ్ పై ఆధారపడి ఉంటుంది. అతని వల్ల మాకు పాత్ర వస్తుంది అనే నమ్మకం కుదిరితే కొందరు హీరోయిన్లు ఒకే చెప్పొచ్చు. మరికొంత మంది హీరోయిన్లకు ఇలాంటి కష్టాలు ఎదురు కాకుండానే స్టార్ డం వచ్చేసింది కదా అని అపూర్వ తెలిపింది. 

57

కొందరు హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ సమస్య లేకుండానే అవకాశాలు వచ్చాయి. అలాగని అందరు హీరోయిన్లు మాకు కాస్టింగ్ కౌచ్ సమస్యే లేదు అని చెబితే మాత్రం అది అబద్దం. నేను చూసిన వాళ్లలో భూమిక, నిత్యామీనన్ కి అలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఎందుకంటే వాళ్ళకి బిగినింగ్ లోనే మంచి సినిమాలు పడ్డాయి. 

 

67

ఒకసారి హిట్ పడితే హీరోయిన్లు నిర్మాతలని, దర్శకులని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే సూట్కేసులతో హీరోయిన్ దగ్గరకి డేట్ల కోసం వెళతారు. భూమిక, నిత్యామీనన్ లాంటి వాళ్ళు హుందాగా ఉంటూ సెట్స్ లో తమ పని తాము చూసుకుని వెళ్ళిపోయేవారు. ఇతర విషయాలని పట్టించుకునేవారు కాదు. 

77

కాస్టింగ్ కౌచ్ గురించి అపూర్వ ఇంకా డిటైల్డ్ గా చెబుతూ.. ఇక్కడ ఇండస్ట్రీలో బలవంతం చేయడం లాంటివి ఉండవు. సింపుల్ గా నీకొక ఛాన్స్ కావాలంటే నాకొక ఛాన్స్ ఇవ్వు అని అడిగేస్తారు. ఒప్పుకోకపోతే మహా అయితే ఏం చేస్తారు ఆఫర్ ఇవ్వరు.. సినిమా నుంచి తీసేస్తారు. తీసేయడం కుదరకపోతే కనిపించినప్పుడు ముఖం పక్కకి తిప్పుకుంటారు. అంతకి మించి ఇండస్ట్రీలో ఏమి ఉండదు అని అపూర్వ కుండబద్దలు కొట్టేసింది. నాకు కూడా అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. వాళ్ళ కమిట్మెంట్ కి ఒప్పుకోకపోవడంతో చాలా సినిమాల నుంచి తీసేశారు అని తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image2
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image3
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved