- Home
- Entertainment
- Anupama Parameswaran Pics : హార్ట్ బ్రేక్ చేస్తున్న అనుపమ స్టైలిష్ లుక్.. యంగ్ బ్యూటీ ఫోజులకు నెటిజన్లు ఫిదా..
Anupama Parameswaran Pics : హార్ట్ బ్రేక్ చేస్తున్న అనుపమ స్టైలిష్ లుక్.. యంగ్ బ్యూటీ ఫోజులకు నెటిజన్లు ఫిదా..
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ లుక్ లో యంగ్ బ్యూటీ అట్రాక్ట్ చేస్తోంది.

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో యంగ్ బ్యూటీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఖుషీ చేస్తుంటుంది.
తన క్రేజ్ పెంచుకునేందుకు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. అనుపమా ఎప్పుడూ ట్రెడిషినల్ గానే కనిపించే అనుపమా తాజాగా వెస్టర్న్ వేర్ లో దర్శనమించింది.
అనుపమ పోస్ట్ చేసిన పిక్స్ చాలా అట్రాక్టీవ్ గా ఉన్నాయి. ఈ ఫొటోల్లో తలపై క్యాప్ పెట్టుకొని, కండ్లకు సన్ గ్లాసెస్ ధరించి, మెడలో చైన్ వేసుకొని స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. క్రేజీ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తోంది.
టామ్ బాయ్ లుక్ లో అనుపమ కనిపించడం ఇదే తొలిసారి. అలాగే ఏదో ఓ రెస్టారెంట్ లో టేబుల్ ముందు కూర్చొని ప్లైట్ లో సర్వ్ చేసిన స్నాక్స్ ను తింటూ కడుపు నింపేస్తోంది. సిటీ వ్యూను చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
తన ఫొటోలపై హీరోయిన్ కోమలి ప్రసాద్ స్పందించారు. ‘నిబ్బి హార్ట్’ అంటూ క్రేజీగా కామెంట్ చేశారు. తను పోస్ట్ చేసిన ఈ పిక్స్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో లైక్స్ రావడం విశేషం.
చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో అలరించిన అనుపమా.. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth)తో కలిసి ‘18 పేజెస్’,‘కార్తీకేయ 2’ చిత్రాల్లో, అలాగే ‘బటర్ ఫ్లై’ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది.