- Home
- Entertainment
- Ananya nagalla: 'మీ నడుము బాగుటుంది మేడమ్'.. అభిమాని మాటకు అనన్య రియాక్షన్ ఏంటంటే..
Ananya nagalla: 'మీ నడుము బాగుటుంది మేడమ్'.. అభిమాని మాటకు అనన్య రియాక్షన్ ఏంటంటే..
సోషల్ మీడియా కాలంలో అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గిపోయింది. నేరుగా తమ అభిమాన సినీ తారలతో మాట్లాడే రోజులు వచ్చేశాయి. దీంతో తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేస్తున్నారు. తనకు కూడా ఓ అభిమాని నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురైందని చెప్పుకొచ్చింది అందాల తార అనన్య నాగళ్ల. ఇంతకీ ఆ నాటీ కామెంట్ ఏంటంటే..

ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది తెలుగమ్మాయిల్లో అందాల అనన్య నాగళ్ల ఒకరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. హైదరాబాద్‌లోని రాజ మహేంద్ర కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి ఫుల్‌స్టాప్ పెట్టి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
2019లో వచ్చిన మల్లేశం మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ విభాగంలో సైమా అవార్డును సైతం అందుకుంది. ఇక ఆ తర్వాత ప్లేబ్యాక్ మూవీలో మెప్పించింది. అలాగే పవన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
వరుస అవకాశాలు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయిందీ చిన్నది. అయితే తాజాగా తంత్రా, పొట్టేల్, శ్రీకాకుళలం షెర్లాక్ హోమ్స్ వంటి చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో అనన్య పంచుకున్న ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
దావత్ టాక్ షోలో పాల్గొన్న అనన్యను, అరియానా ప్రశ్నిస్తూ.. 'మీ జీవితంలో ఎదురైన బెస్ట్, నాటీ కంప్లిమేంట్' ఏంటి అని అడుగుతుంది. దీనికి బదులిస్తూ అనన్య తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో ఇంకా అప్పటికీ పెద్దగా గ్లామర్ పాత్రలో నటించని సమయంలో ఓ షాప్ ఓపెనింగ్ వెళ్లాలనని, ఆ సమయంలో ఓ అభిమాని ఎంతో ఆతృతగా తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చింది. అలా వచ్చిన ఆ అభిమాని 'మేడమ్ మీ నడుము చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడంటా. అయితే ఆ కామెంట్ వల్ల తనకు కోపం రాలేదని, పైగా నచ్చిందని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ వీడియోకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.