MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి

Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి

సీనియర్ నటి ఆమని టాలీవుడ్ జరిగే కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియర్లు కూడా కమిట్మెంట్ అడుగుతారు అని ఆమె అన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయట పెట్టారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 01 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్
Image Credit : our own

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలని ధైర్యంగా బయటకు చెప్పారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు ఇబ్బందులు సావిత్రి గారి కాలం నుంచే ఉన్నాయి అని ఆమని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్ అయ్యేందుకు చెడు పద్దతి కూడా ఉంది
Image Credit : our own

హీరోయిన్ అయ్యేందుకు చెడు పద్దతి కూడా ఉంది

ప్రతిచోట మంచి చెడు ఉన్నట్లే ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. దేనిని ఎంచుకోవాలి, దేనివైపు వెళ్ళాలి అనేది మన మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. కష్టపడి హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు, అదే విధంగా చెడు పద్దతుల ద్వారా హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు కూడా ఉన్నారు అని ఆమని అన్నారు.

35
అసభ్యంగా అడిగారు
Image Credit : google

అసభ్యంగా అడిగారు

నేను హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కొందరు కొత్త బ్యానర్ స్థాపించి ఆడిషన్స్ కి పిలిచేవాళ్ళు. అవి పేరున్న కంపెనీలు కాదు. అయినా సరే అదృష్టం బావుంటే హీరోయిన్ గా ఛాన్స్ వస్తుంది కదా అని ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని. మీకు లోపల ఏమైనా మచ్చలు ఉన్నాయోమో చూడాలి. ఎందుకంటే మీరు మూవీలో స్విమ్ సూట్ వేసుకోవాలి. కాబట్టి బట్టలు తీసి మచ్చలు చూపించండి అని అడిగారు.

45
స్విమ్ సూట్ వేసుకుంటా, మీ ముందు ఆ పని చేయను
Image Credit : Actress Aamani\Instagram

స్విమ్ సూట్ వేసుకుంటా, మీ ముందు ఆ పని చేయను

స్విమ్ షూట్ వేసుకోవాలి అంటే సినిమాలో వేసుకుంటాను. ఇక్కడ మీకెందుకు చూపిస్తాను. ఆ అవసరం ఏంటి అని అడిగేదాన్ని. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయేదాన్ని అని ఆమని తెలిపారు. బహుశా అలాంటి మైండ్ సెట్ ఉండి, తప్పనిసరిగా హీరోయిన్ కావాలి అని అనుకునే అమ్మాయిలు చూపిస్తారేమో. నేను మాత్రం అలా చేయను అని ఆమని అన్నారు.

55
ఫైనాన్షియర్ ని పర్సనల్ గా కలవమన్నారు
Image Credit : our own

ఫైనాన్షియర్ ని పర్సనల్ గా కలవమన్నారు

మరో సంఘటన కూడా ఎదురైంది. హీరో డైరెక్టర్ కాదు ఏకంగా ఫైనాన్షియర్ తో కమిట్మెంట్ అడిగారు. ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. మేనేజర్ కారు తీసుకుని ఇంటికి వచ్చారు. మేడం డైరెక్టర్ గారు బీచ్ దగ్గర స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నారు. అక్కడికి ఫైనాన్సియర్ కూడా కూడా వస్తారు. ఫైనాన్సియర్ మిమ్మల్ని పర్సనల్ గా చూడాలి అంటున్నారు అంటూ మేనేజర్ చెప్పారు. ఫైనాన్షియర్ నన్నెందుకు చూడాలి. డైరెక్టర్ చూడాలి నేను ఎలా ఉన్నానో, సినిమాకి పనికొస్తానా లేదు అని ఆయన చూడాలి. హీరో కూడా చూడొచ్చు. తన పక్కన నటించే అమ్మాయిని కాబట్టి ఎలా ఉంటానో అని చూడవచ్చు. అసలు ఫైనాన్సియర్ కి ఏం పని అని అడిగాను. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యాక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు ఆమని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Related Stories
Recommended image1
OTT Movies: ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ
Recommended image2
Peddi Movie: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved