హీరోయిన్ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సుమంత్, ఏమన్నాడంటే?
హీరోయన్ మృణాల్ ఠాకూర్‌తో తన పెళ్లిపై వస్తున్న వార్త పై హీరో సుమంత్ స్పందించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి క్లారిటీ కూడా ఇచ్చారు సుమంత్. ఇంతకీ ఆఞన ఏమన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇటీవల టాలీవుడ్‌లో హీరో సుమంత్ మరియు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్‌గా సోఫాలో కూర్చున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో, దానిని ఆధారంగా చేసుకుని పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేశాయి. ఈ వార్తలపై ఇద్దరూ స్పందించకపోవడం వలన, వదంతులు మరింతగా విస్తరించాయి.
అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో సుమంత్ స్పందించారు. మృణాల్ ఠాకూర్‌తో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ‘‘మృణాల్‌తో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో సీతారామం సినిమా షూటింగ్ సమయంలో తీసినదే. ఆ సినిమా తర్వాత మేమిద్దరం కలుసుకోవడం కూడా జరగలేదు,’’ అని సుమంత్ తెలిపారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాట్లాడుతూ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. ‘‘నాకు పెళ్లి అనే ఆలోచనే రాదు. నాకు ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం. నాకు రొటీన్ లైఫ్ బోర్ అనిపించదు. రోజు ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో గడుపుతాను. తర్వాత జిమ్ చేస్తాను, స్పోర్ట్స్ ఆడుతాను. ఇదే జీవితం నాకు సంతృప్తినిస్తుంది,’’ అని చెప్పారు.
గతంలో హీరోయిన్ కీర్తి రెడ్డితో సుమంత్‌కు పెళ్లి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లికి విడాకులు వచ్చిన తర్వాత ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. తాజాగా వస్తున్న వార్తలపై స్పందిస్తూ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయడం ద్వారా, ఈ పుకార్లకు ఒకవరకు స్వస్తి పలికారు.ఈ వివరణతో మృణాల్ ఠాకూర్‌తో సుమంత్‌కు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, పెళ్లి వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.