- Home
- Entertainment
- స్టార్ హీరోని ఇంటి గేటు బయటే నిలబెట్టి రావొద్దని చెప్పిన సుమన్..వాళ్ళ అమ్మ కనుక లేకుంటే, షాకింగ్
స్టార్ హీరోని ఇంటి గేటు బయటే నిలబెట్టి రావొద్దని చెప్పిన సుమన్..వాళ్ళ అమ్మ కనుక లేకుంటే, షాకింగ్
హీరో సుమన్ జైలు నుంచి విడుదలయ్యాక ఓ స్టార్ హీరో అతన్ని కలవడానికి వెళ్లారు. గేటు దగ్గర ఉన్న ఆ హీరోని కలవడానికి సుమన్ ఇష్టపడలేదు.

actor suman
హీరో సుమన్ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ కెరీర్ ని దిగజార్చిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ సంఘటన వల్ల సుమన్ 6 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో సుమన్ ఎన్నో క్రేజీ ఆఫర్స్ కోల్పోయారు.
తమిళనాడులో ఒక పోలీస్ అధికారి కుమార్తె తన వెంట పడడం వల్ల ఇదంతా జరిగినట్లు సుమన్ తెలిపారు. చిరంజీవి విషయంలో ప్రచారం లో ఉన్న రూమర్స్ అన్నింటిని కొట్టి పారేశారు. ఆ పోలీస్ అధికారి అప్పటి సీఎం ఎంజీఆర్ కి ఫిర్యాదు చేయడంతో ఇదంతా జరిగింది. ఆ అమ్మాయే తన వెంట పడుతోందని, తన తప్పు ఏమి లేదని చెప్పినా ఎంజీఆర్ వినిపించుకోలేదట.
తనపై కక్ష కట్టి లేనిపోని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారు అని సుమన్ తెలిపారు. ఆరు నెలలు జైల్లో గడిపా. ఆ సమయంలో లోపల ఉన్న ఖైదీలు నన్ను బాగా చూసుకున్నారు. జైలు నుంచి వచ్చాక చాలా మంది సుమన్ ని ఫోన్ చేసి పరామర్శించారు. అయితే నేరుగా వెళ్లి కలసి పరామర్శించడానికి ఎవరూ సాహసం చేయలేదు. లేనిపోని చిక్కులు ఎందుకు అనుకున్నారు.
కానీ ఇద్దరు మాత్రం అలా అనుకోలేదట. అందులో ఒకరు నటి సుమలత. సుమలత నేరుగా సుమన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. హీరోల్లో ఆ సాహసం చేసిన వ్యక్తి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఒక రోజు మోహన్ బాబు ఉదయాన్నే వెళ్లి సుమన్ ఇంటి గేటు వద్ద నిలబడి ఉన్నారట.
సుమన్ జైలు నుంచి వచ్చి కొద్దిరోజులే అవుతోంది. దీనితో ఆయన ఎవరిని కలసి మాట్లాడే మూడ్ లో లేరు. మీ కోసం ఒక నటుడు వచ్చి ఉన్నారు అని చెబితే.. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.. పంపించేయండి అని సుమన్ అన్నారట. వెంటనే సుమన్ వాళ్ళ అమ్మ వచ్చి.. వచ్చింది మోహన్ బాబు గారు.. నువ్వు తప్పకుండా మాట్లాడాలి అని చెప్పారు.
అమ్మ చెప్పడంతో సుమన్ మోహన్ బాబు గారిని లోపలికి ఆహ్వానించారు. మోహన్ బాబుగారు ముక్కోపి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అని అంతా అంటారు. నేను అవన్నీ పట్టించుకోను. నా కోసం ఆయన వచ్చి గేటు దగ్గర నిలబడ్డారు. ఆయనకి రావాల్సిన అవసరం లేదు. కానీ వచ్చి పలకరించారు. కాబట్టి మోహన్ బాబు గారిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని సుమన్ తెలిపారు. తన పెళ్ళికి కూడా వచ్చి గిఫ్ట్ ఇచ్చారని సుమన్ పేర్కొన్నారు.