శివాజీ పట్టిందల్లా బంగారం అవుతోందిగా.. కోర్ట్ లో అదరగొట్టేశాడు
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శికి అద్భుతమైన చిత్రాలు తగులుతున్నాయి. బలగం చిత్రం సంచలనం సృష్టించింది. బలగం చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించారు. ప్రియదర్శి తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోర్ట్.

Sivaji
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శికి అద్భుతమైన చిత్రాలు తగులుతున్నాయి. బలగం చిత్రం సంచలనం సృష్టించింది. బలగం చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించారు. ప్రియదర్శి తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోర్ట్. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా, రామ్ జగదీశ్ దర్శకత్వంలో కోర్ట్ చిత్రం తెరకెక్కింది.

ప్రేమ, పరువు వ్యవహారాలతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ అవుతోంది. అంతకంటే ముందుగా చిత్ర యూనిట్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ నుంచి కోర్ట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ.. కోర్ట్ చిత్రం మీకు నచ్చకపోతే.. తాను నటించిన హిట్ 3 చూడకండి అని సవాల్ చేశారు. అంటే ఈ చిత్రంపై నానికి అంత కాన్ఫిడెన్స్ ఉంది.
ఈ మూవీలో నటుడు శివాజీ నెగిటివ్ రోల్ లో నటించారు. శివాజీ పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్ బంధువు మంగపతి పాత్రలో శివాజీ ఈ చిత్రంలో నటించారు. పరువు, స్థాయి కోసం ఎంత దూరం అయినా వెళ్లే పాత్ర అతడిది. హీరోపై అనవసరంగా కఠినమైన చట్టాలతో కేసు పెట్టేది అతడే. ఈ పాత్రలో శివాజీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని ప్రశంసలు దక్కుతున్నాయి.
Court
ఇటీవల శివాజీ పట్టిందల్లా బంగారం అవుతోంది. బిగ్ బాస్ షోలో హైలైట్ అయ్యారు. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు కోర్ట్ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

