MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రతినెలా నరేష్ మూడో భార్యకు డబ్బులు పంపుతున్నాడా! అసలు రమ్య ఏం కోరుకుంటుంది?

ప్రతినెలా నరేష్ మూడో భార్యకు డబ్బులు పంపుతున్నాడా! అసలు రమ్య ఏం కోరుకుంటుంది?

రమ్య రఘుపతి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె నరేష్ నుండి ఏమి ఆశిస్తున్నారో ఓపెన్ గా చెప్పారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 11 2023, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ramya Raghupathi

Ramya Raghupathi

నరేష్ పెళ్లి ప్రకటన చేసిన వారం రోజుల తర్వాత రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. ఆమె నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవిత్ర లోకేష్ తో ఎఫైర్ పెట్టుకున్న నరేష్ నన్ను వదిలించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎఫైర్స్ అంటగట్టడం తోపాటు, దూషిస్తూ మానసికంగా వేధించారన్నారు. నరేష్ క్యారెక్టర్ మంచిది కాదని, నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడని దారుణ ఆరోపణలు చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naresh

Naresh

తాజా ఇంటర్వ్యూలో మరొకొన్ని అంశాలపై రమ్య రఘుపతి స్పందించారు. నరేష్ పేరు చెప్పి ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు, అప్పులు చేసినట్లు నరేష్ ఆరోపించిన నేపథ్యంలో స్పష్టత ఇచ్చారు. నేను అప్పులు చేసిన విషయం వాస్తవమే. లాక్ డౌన్ కారణంగా నా వ్యాపారం దెబ్బతింది. అందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. 
 

37
Ramya Raghupathi

Ramya Raghupathi

నేను చేసిన అప్పులకు ఆయనేమీ హామీగా లేరు. ఆయన ఎక్కడా గ్యారెంటర్ గా ఉండి నాకు అప్పు ఇప్పించలేదు. మా అమ్మగారి ఫ్లాట్ తాకట్టు పెట్టి నేను లోన్ తీసుకున్నాను. ఇక నాపై వచ్చిన ఆర్థిక నేరారోపణలు వెనుక ఆయనున్నారు. ఉద్దేశపూర్వకంగా నరేష్ నన్ను ఇరికించే ప్రయత్నం చేశాడని రమ్య అన్నారు. తన ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని రమ్య అన్నారు. 
 

47

ఆయన వద్ద ఉన్న వందల కోట్లు కోసమే మీరు ఇదంతా చేస్తున్నారట కదా? అని విలేకరి అడగ్గా... నేను ఆయన ఆస్తులు కోరుకోవడం లేదు. భార్యగా ఉండాలనుకుంటున్నాను. విడాకులు ఇస్తే నరేష్ కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ పలు కథనాలు వస్తున్నాయి. నాకు డబ్బుపై ఆశ ఉంటే అదే చేస్తాను కదా.. అని సమాధానం చెప్పారు.

57


నేను కోట్ల కోసం ఆయనపై పిటిషన్ వేయలేదు. మా మధ్య మనస్పర్థలు ఉన్నమాట వాస్తవమే. అవి చర్చల ద్వారా పరిష్కరించండి. నాకు నరేష్ కావాలని మాత్రమే కోర్టుని కోరాను అన్నారు. ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఆరోపణలు చేసుకున్నారు... ఇంకా నరేష్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారని రమ్య రఘుపతిని అడగడం జరిగింది. 

67


కేవలం కొడుకు కోసమే నేను విడాకులు వద్దనుకుంటున్నాను. మా అబ్బాయి తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. వాడి మైంటైనెన్స్ కి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఓ మూడేళ్ళ నుండి మాత్రం ఇస్తున్నాడు. అది కూడా నెలకు యాభై వేలు ఇచ్చేవాడు. ప్రస్తుత రూ. 70 వేలు ఇస్తున్నాడు... అని రమ్య రఘుపతి సమాధానం చెప్పారు. 

77
Naresh

Naresh

అధికారికంగా నాకు విడాకులు ఇవ్వడకుండా నరేష్-పవిత్ర లోకేష్ వివాహం చెల్లదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. నేనైతే నరేష్ కి విడాకులు ఇచ్చేది లేదు. నాకు భర్త కావాలనే కోరుకుంటున్నాను... అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. రమ్య రఘుపతి ఆరోపణలపై ఇంతవరకు నరేష్ స్పందించకపోవడం విశేషం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Recommended image2
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image3
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved