- Home
- Entertainment
- కృష్ణగారి పరువుపోతుందని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా... నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్
కృష్ణగారి పరువుపోతుందని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా... నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్
నరేష్-పవిత్రల పెళ్లితో వివాదానికి ఎండ్ కార్డు పడుతుంది అనుకుంటే పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు.

Naresh
నటుడు నరేష్ ఇటీవల పవిత్ర లోకేష్ తో పెళ్లి ప్రకటన చేశారు. ఈ ఏడాది తాము వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ ప్రకటనపై రమ్య రఘుపతి స్పందించలేదు. అలాగే ఆమెకు పెద్ద మొత్తంలో నరేష్ భరణం ఇచ్చి సెటిల్ చేశాడని, ఆమెతో అధికారికంగా విడాకులు అయ్యాయంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే రమ్య రఘుపతి-నరేష్ లకు విడాకులు మంజూరు కాలేదని తెలుస్తుంది.
నరేష్(Naresh) పెళ్లి ప్రకటన తర్వాత రమ్య రఘుపతి మొదటిసారి మాట్లాడారు. ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ దారుణాలకు పాల్పడ్డాడని ఆమె సీరియస్ అలిగేషన్స్ చేయడం టాలీవుడ్ లో అతిపెద్ద చర్చకు దారి తీసింది.
నరేష్ నన్ను వదిలించుకోవడానికి దారుణాతి దారుణాలు చేశాడు. చివరకు దేవుడు లాంటి కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నా నుండి కృష్ణకు ప్రాణహాని ఉందని ఒక లెటర్ తయారు చేశాడు. ఆ లెటర్ స్వయంగా కృష్ణ రాస్తూ నాపై కంప్లయింట్ చేసినట్లు చిత్రీకరించారు. లెటర్ లో కృష్ణగారి సైన్ ఫోర్జరీ చేసి... కేసు పెట్టాడు. ఈ విషయం కృష్ణగారికి కూడా తెలియదు.
Naresh
కృష్ణగారి గౌరవమర్యాదలు దెబ్బతిన్నకూడదు, ఆయన ప్రతిష్టకు భంగం కలగకూడదని నేను ఈ విషయాలు బయటపెట్టలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నరేష్ కి నేను విడాకులు ఇచ్చేది లేదు. నా కొడుకు తండ్రి కావాలని అడుగుతున్నాడు.
నరేష్ నాకు పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ని పరిచయం చేసినప్పుడు ఆమెకు నేను అన్నం పెట్టాను. ఆమె మాత్రం నాకు సున్నం పెట్టింది... అంటూ రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
రమ్య రఘుపతి(Ramya Raghupathi) ఇంకా మాట్లాడుతూ... నరేష్ నాకు డ్రైవర్ తో కూడా అఫైర్స్ అంటగట్టారు. నిందలు వేశాడు. నరేష్ కి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది.'' డాడీ డర్టీ పిక్టర్స్ చూస్తున్నాడు'' అని నా కొడుకు పలుమార్లు నాతో చెప్పాడు. కొడుకు పట్ల బాధ్యతగా వ్యవహరించడం కూడా నరేష్ కి తెలియదు.
Naresh Babu Pavitra Lokesh Ramya Raghupathi
నా మీద ఆరోపణలు చేయడం, గొడవపడటం కొడుకును మానసికంగా డిస్టర్బ్ చేసేది. నరేష్ దారుణంగా ప్రవర్తించాడు... అని రమ్య చెప్పుకొచ్చారు. రమ్య తాజా వాఖ్యల నేపథ్యంలో ఈ ట్రైయాంగిల్ ఫ్యామిలీ డ్రామా ముగిసే సూచనలు కనిపించడం లేదు.
Naresh
నరేష్-పవిత్రల బంధాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైసూర్ హోటల్ గదిలో నరేష్, పవిత్ర ఉన్నారని తెలిసి ఆమె గది ముందు బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి అక్కడ నుండి పంపించేశారు. ఇటీవల కృష్ణ(Superstar Krishna) మరణించగా... ఆయన భౌతికకాయం సందర్శించి, రమ్య నివాళులు అర్పించింది.