పవిత్ర లోకేష్‌కి లిప్ కిస్‌తో తమ పెళ్లిని ప్రకటించిన నరేష్.. వామ్మో ఇదెక్కడి తెగింపు.. నెట్టింట రచ్చ..
సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల అనంతరం తాజాగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
నటుడు నరేష్ నటుడిగా కీలక పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు పవిత్ర లోకేష్ సైతం అమ్మ, అత్త పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. అదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా ఈ విషయంలో రచ్చ చేసింది. కొన్ని రోజులపాటు ఈ రచ్చ జరిగింది. నరేష్, ఆయన మూడో భార్య విడాకుల మ్యాటర్ కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో దీనిపై ఆమె వివాదం చేసింది. నరేష్‌ని ఓ హోటల్‌లో చెప్పుతోనూ కొట్టేందుకు ప్రయత్నించింది. రెండుమూడు నెలల క్రితం ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
అంతకు ముందు నుంచే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి తిరుగుతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఏకంగా వీరిద్దరు కలిసి గుళ్లుగోపురాలు కూడా తిరిగారు. చాలా సార్లు మీడియా కంట పడ్డారు. ఏదైనా సినిమా ఫంక్షన్లకి, అలాగే ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ ఈ ఇద్దరు కలిసే వెళ్లడం ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే ఊహగానాలకు బలం చేకూరింది. ఇటీవల కృష్ణగారి మరణంలోనూ నరేష్ వెంటే ఉంది పవిత్ర, అంతకు ముందు మహేష్ తల్లి ఇందిరా దేవి మరణం సమయంలోనూ అక్కడే ఉంది. మరోవైపు బెంగుళూరు ఓ హోటల్‌లోనూ కలిసి ఉన్న విజువల్స్ బయటకొచ్చాయి.
ఇవన్నీ వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారనే పుకార్లకి మరింత బలం చేకూరాయి. కొన్ని రోజులుగా వీరి టాపిక్ సర్దుమనిగింది. అంతా సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకు, సినీ వర్గాలకు, ఆడియెన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చిందీ జంట. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31 సందర్బంగా శనివారం తమ మ్యారేజ్‌ని అనౌన్స్ చేశారు.
`వెల్ కమ్ టూ అవర్ వరల్డ్` అంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నరేష్. క్యాండిన్ లైట్ల మధ్యలో కేక్ పెట్టి కట్ చేసుకుని ఒకరి ఒకరు కేక్ తినిపించుకున్నారు. అంతటితో ఆగలేదు, ఏకంగా ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకోవడం విశేషం. ఇదే ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. లేట్ వయసులో ఇంతటి ఘాటు ముద్దుతో తమ పెళ్లిని ప్రకటించడంతో ఇది నెట్టింట రచ్చ లేపుతుంది.
అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. పవిత్రనరేష్ యాష్ ట్యాగ్‌ని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. మీ వరల్డ్ లోకి మాకేం పని, మీ ప్రపంచంలోకి మేం ఎందుకు అని, లేటు వయసులో ఘాటు ముద్దులేంటి? జోరు మీదున్న నరేష్, పవిత్ర లోకేష్, వీరిని ఆపేదెవరు, దూసుకుపోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోసల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.
ఇద్దరు లిప్ కిస్‌తో పెళ్లిని ప్రకటించడమే ఇక్కడ హైలైట్ గా నిలుస్తుంది. ఇదే నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొంటె కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నరేష్ మొదట సీనియర్ సినిమాటోగ్రాఫర్ కూతురు ని పెళ్లి చేసుకున్నారు నరేష్. ఆమెకే నవీన్ విజయ్ కృష్ణ పుట్టారు. ఆ తర్వాత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియని వివాహం చేసుకున్నారు. వీరికీ ఓ కొడుకు ఉన్నారు. ఇద్దరికీ పడకపోవడంతో విడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు. వీరికీ ఓ కొడుకు ఉన్నారు. ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు నరేష్. మరోవైపు పవిత్ర లోకేష్ కి కూడా పెళ్లై మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఒక్కటి కాబోతుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.