- Home
- Entertainment
- నటి పవిత్రను నాలుగో భార్యగా తెచ్చుకున్న నరేష్... ఆయన ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసా?
నటి పవిత్రను నాలుగో భార్యగా తెచ్చుకున్న నరేష్... ఆయన ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసా?
టాలీవుడ్ లో పెను సంచలనం నమోదు చేసుకుంది. నటుడు నరేష్ నాలుగో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన విడాకులు ఇచ్చిన ముగ్గురు భార్యల గురించి చర్చ నడుస్తుంది.

Actor Naresh and actress Pavitra lokesh
నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ ఎపిసోడ్ కీలక దశకు చేరుకుంది. పవిత్ర లోకేష్ మెడలో నరేష్ తాళి కట్టాడు. మార్చి 10వ తేదీన నరేష్ తన వివాహంపై సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. 2022 డిసెంబర్ 31న నరేష్, పవిత్రను వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేశారు. ఒక రొమాంటిక్ వీడియో షేర్ చేసి పెళ్లి వార్త పంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. చెప్పినట్లే నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. సహజీవనానికి ఫుల్ స్టాప్ పెట్టి బంధం అధికారికం చేసుకున్నారు.
Actor Naresh
ఈ క్రమంలో నరేష్ పెళ్లి చేసుకున్న ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడాకులు ఇచ్చారు? వారి పిల్లలు ఎవరు? అనే విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో నరేష్ తన మూడు వివాహాల గురించి వివరణ ఇచ్చారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చారు. 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టాను. 19 ఏళ్లకు పెద్దలు నాకు పెళ్లి చేశారు. అంటే దాదాపు బాల్య వివాహం. ఆ వయసులో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. మొదటి భార్యకు అనారోగ్యం అందుకే విడిపోవాల్సి వచ్చిందన్నారు.
Naresh
తర్వాత రెండో వివాహం చేసుకున్నాను. మనస్పర్థలతో విడిపోయాము. మూడో భార్యతో కూడా విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది. ఇందులో తప్పెవరిది అంటే... ఎవరినీ నిందించడానికి లేదు. ఒకప్పుడు ఎక్కడో ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నాయి. కారణం విడిపోయే వారి సంఖ్య ఎక్కువైపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. భార్య హౌస్ వైఫ్ గా ఉండేది. ఇల్లు చక్కబెట్టడమే ఆమె ప్రధాన కర్తవ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు భార్య భర్త ఉద్యోగం చేస్తున్నారు. ఆది కూడా విడాకులకు ఒక కారణం. ఇక చుట్టాలు, పక్కాలు ఉండనే ఉన్నారు. ఇలా అనేక కారణాలున్నాయి. విడిపోయిన వారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, అని నరేష్ చెప్పుకొచ్చారు.
Naresh
సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తె నరేష్ మొదటి భార్య. వీరికి ఒక అబ్బాయి. అతని పేరు నవీన్ విజయ కృష్ణ. ఇతడు ఎడిటర్, హీరోగా కూడా ఓ మూవీ చేశాడు. మొదటి భార్యతో విడాకులు అనంతరం దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. అతడు పెయింటింగ్ ఆర్టిస్ట్ అని నరేష్ వెల్లడించారు.
ఓ నాలుగేళ్ల క్రితం రమ్య రఘుపతి తన జీవితంలోకి వచ్చినట్లు నరేష్ చెప్పారు. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. రమ్య రఘుపతితో నరేష్ కి విడాకులు కాలేదు. ఆమె విడాకులు ఇచ్చేది లేదని పట్టుబడుతున్నారు. విడాకులు మంజూరు కాకుండా నరేష్ వివాహం చేసుకోవడానికి కారణమేంటన్న చర్చ నడుస్తుంది. విడాకులు రాకున్నా విడిపోయి ఏడేళ్లు అవుతుండగా... చట్టంలో సానుకూల అంశాలు ఉన్న నేపథ్యంలో నరేష్ మరో వివాహం చేసుకున్నారని అంటున్నారు.
అయితే నరేష్ నేడు మీడియా ముందుకు వచ్చారు. ఇంటింటి రామాయణం చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఆయన పెళ్లిపై క్లారిటీ అడిగారు. నరేష్ దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రెస్ మీట్ పెట్టి త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. ఇక ఇది నిజమైన పెళ్లని కొందరు అంటుండగా, సినిమాలో భాగం అని మరికొందరు. ప్రమోషనల్ స్టంట్ కూడా కావచ్చంటున్నారు.