Actor Nandu:వెక్కి వెక్కి ఏడ్చిన నందు, ఆ 12 రోజులు నరకం చూపించారు.. గుండెల్ని పిండేసేలా ఆవేదన
ఒకవైపు క్రికెట్ యాంకరింగ్, మరోవైపు టివి.. అదే సమయంలో సినిమాలు ఇలా నందు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అభిమానులకు నందు ఎప్పుడూ చిరునవ్వు ముఖంతోనే కనిపిస్తాడు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. నందు కంటతడి పెట్టుకోవడం ఎప్పుడూ చూసి ఉండరు.
బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఢీ షోలో యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు.
నందు కూడా యాంకర్ గా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు క్రికెట్ యాంకరింగ్, మరోవైపు టివి.. అదే సమయంలో సినిమాలు ఇలా నందు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అభిమానులకు నందు ఎప్పుడూ చిరునవ్వు ముఖంతోనే కనిపిస్తాడు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. నందు కంటతడి పెట్టుకోవడం ఎప్పుడూ చూసి ఉండరు.
తాజాగా ఢీషో వాలంటైన్స్ డే కోసం ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్, హైపర్ ఆది మధ్య ఫన్నీ ఫన్నీగా సంభాషణ జరుగుతోంది. అమ్మాయిల చేస్తా శేఖర్ మాస్టర్ కి హైపర్ ఆది ముద్దులు పెట్టిస్తున్నాడు. కళ్ళు మూసుకుని ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి. ఈ సీన్ లో హైపర్ ఆది శేఖర్ మాస్టర్ పై సెటైర్లతో రెచ్చిపోయాడు.
అయితే వేదికపై నందు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అంతే కాదు అందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించారు. తనపై పడిన ఒక నింద గురించి నందు మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు. నందు చెప్పిన విషయాలు గమనిస్తే ఆ భాద డ్రగ్స్ వివాదానికి సంబంధించినదే అని అనిపిస్తోంది.
మీ జీవితంలో జరిగిన ఎమోషనల్ సంఘటన ఏంటి అని హైపర్ ఆది అడిగారు. దీనికి నందు బదులిస్తూ.. నాపై ఒక రూమర్ వచ్చింది. నాకు ఎలాంటి సంబంధం లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. మాట్లాడుతూ మాట్లాడుతూ నందు దుఃఖం ఆపుకోలేకపోయారు. స్వరం మారిపోయింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఏడుస్తూనే ఆ సంఘటనని నందు వివరించారు.
నేను ఆ తప్పు చేశాను చేశాను అని న్యూస్ లో 12 రోజులు వేశారు. దానివల్ల నరకం అనుభవించినట్లు నందు వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పారు. కానీ చివరకి ఆ తప్పు నేను చేయలేదని తేలింది. కానీ ఆ విషయాన్ని మాత్రం స్క్రోలింగ్ లో చిన్నగా వేశారు అని నందు తన ఆవేదన మొత్తం బయట పెట్టారు.
నందు ఏడుస్తుంటే పక్కనే ఉన్న హైపర్ ఆది ఓదార్చే ప్రయత్నం చేశారు. నందు మాటలకు అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాలు గుండెల్ని పెండేసే విధంగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం తీవ్ర కలకలం రేపింది. పూరి జగన్నాధ్, తరుణ్, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, ఛార్మి, నందు ఇలా పలువురు పేర్లు డ్రగ్స్ వివాదంలో వినిపించాయి. కానీ వీళ్లెవరికి డ్రగ్స్ తో సంబంధం లేదని ఇటీవల కేసుని కొట్టివేశారు.