ఎన్నికల వేళ మెగా-నందమూరి హీరోల మధ్య నాగబాబు చిచ్చు... క్షమాపణలు చెప్పినా నో యూజ్!
నాగబాబు అనాలోచితంగా చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి. పొట్టి హీరోలు పోలీస్ పాత్రలకు నప్పరు అని ఆయన అన్నారు. ఇది మెగా-నందమూరి ఫ్యాన్ వార్ కి దారి తీసింది.
Nagababu
ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ... ఐదు అడుగుల మూడు అంగుళాల హీరో పోలీస్ అంటే.. వీడు పోలీస్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు చేయాలంటే హైట్ ఉండాలి... అని అన్నారు.
NTR
ఈ కామెంట్స్ నాగబాబు జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి అన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్ కి ఈ కామెంట్స్ ఆపాదిస్తూ యాంటీ ఫ్యాన్స్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.
నాగబాబు ఉద్దేశం ఏదైనా కానీ అది పొట్టి హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. నాగబాబు కామెంట్స్ వివాదానికి దారితీయగా వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు. హైట్ ఉన్నవారు ఆర్మీ అధికారి పాత్రలకు సెట్ అవుతారని చెప్పే క్రమంలో నాగబాబు అలా మాట్లాడారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వరుణ్ వివరణ ఇచ్చాడు.
Nagababu
అయినా వివాదం సద్దుమణగలేదు. దాంతో నాగబాబు నేరుగా క్షమాపణలు చెప్పారు. పొట్టి హీరోలు పోలీస్ పాత్రలకు సెట్ అవ్వరు అని ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అయితే నాగబాబు పోస్ట్ క్రింద ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.
Ram Charan
ఎన్టీఆర్ పొట్టివాడని చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే... చరణ్ పొట్టివాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. నాగబాబు క్షమాపణల పోస్ట్ వివాదాన్ని తగ్గించకపోగా... పెంచింది.
ఎన్నికల వేళ ఇది టీడీపీ, జనసేన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న క్రమంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ కలిసి పని చేయాల్సి ఉంది. మరి ఈ ఫ్యాన్ వార్స్ పొత్తు స్ఫూర్తిని దెబ్బ తీసే అవకాశం ఉంది. అందరు హీరోల ఫ్యాన్స్ మద్దతు కోరుతున్న పవన్ కళ్యాణ్ వేదికల మీద ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పేర్లు ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే...
ఇక ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. నిజానికి వెండితెరపై చరిత్ర సృష్టించిన ఏఎన్నార్, కమల్ హాసన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ పొట్టివారే. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించారు. టాలీవుడ్ స్టార్స్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పెద్ద హైట్ ఏమీ కాదు.