- Home
- Entertainment
- హీరో ఎవరో తెలుసా, ఎవరైనా సరే నేను చేయను.. డైరెక్టర్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన జయప్రకాశ్ రెడ్డి
హీరో ఎవరో తెలుసా, ఎవరైనా సరే నేను చేయను.. డైరెక్టర్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన జయప్రకాశ్ రెడ్డి
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన హాస్య నటుల్లో జయప్రకాష్ రెడ్డి ఒకరు. విలన్ గా, కమెడియన్ గా అనేక పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో జయప్రకాశ్ రెడ్డి ఆకట్టుకున్నారు. ఆయన హావభావాలు, డైలాగ్ చెప్పే విధానం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన హాస్య నటుల్లో జయప్రకాష్ రెడ్డి ఒకరు. విలన్ గా, కమెడియన్ గా అనేక పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో జయప్రకాశ్ రెడ్డి ఆకట్టుకున్నారు. ఆయన హావభావాలు, డైలాగ్ చెప్పే విధానం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాయి. కొన్ని దశాబ్దాల పాటు జయప్రకాశ్ రెడ్డి నటుడిగా రాణించారు. 2020లో ఆయన ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ దర్శకులలో శ్రీను వైట్ల, వివి వినాయక్ లాంటి వారితో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉండేది. శ్రీనువైట్లతో ఒక సందర్భంలో జయప్రకాశ్ రెడ్డికి ఊహించ సంఘటన ఎదురైందట. శ్రీనువైట్ల తొలి చిత్రం నీ కోసం చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి విలన్ గా ఫుల్ లెన్త్ రోల్ చేశారు. ఆ తర్వాత శ్రీనువైట్ల ఆనందం అనే చిత్రం తీశారు. అందులో కేవలం ఒక రోజు షూటింగ్ ఉండే పాత్ర మాత్రమే ఇచ్చారు. చేశాను. ఆ చిత్రం పెద్ద హిట్ అయింది.
ఆ తర్వాత సొంతం చిత్రంలో కూడా ఒక రోజు వేషమే ఇచ్చారు. అయినా చేశాను. కొన్ని చిత్రాలు అలాగే ఒక రోజు షూటింగ్ ఉన్న పాత్రలకి మాత్రమే నన్ను శ్రీను వైట్ల పరిమితం చేశారు. చివరగా శ్రీనువైట్ల ఫోన్ చేసి ఒక చిత్రం చేస్తున్నాం, అందులో ఒక రోజులో కంప్లీట్ అయ్యే పాత్ర ఉందని చెప్పారు. మళ్ళీ ఒక రోజు వేషమే అనేసరికి నాకు కోపం వచ్చింది. చేయను అని చెప్పేశా. అదే విధంగా కొనసాగిస్తే ఇండస్ట్రీలో అందరూ నన్ను చిన్న పాత్రలకే పరిమితం చేస్తారు. కాబట్టి చేయను అని ముఖం మీదే చెప్పా.
శ్రీనువైట్ల వెంటనే అన్నా ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా అని అడిగారు. ఎవరైతే నాకేంటి, నేను చేయను అని చెప్పా. నీ ఫస్ట్ మూవీలో ఫుల్ లెన్త్ రోల్ ఇచ్చావు, బాగా చేశాను కదా. అలా పెద్ద రోల్స్ ఇస్తే నేను చేయలేనా, నువ్వు నాచేత చేయించుకోలేవా అని అడిగా. నన్ను వన్ డే కి పరిమితం చేస్తున్నారు ఏంటి, ప్రధాన పాత్రలకు నేను పనికిరానా అని జయప్రకాష్ రెడ్డి శ్రీను వైట్లని అడిగారు. ఆ పెద్ద హీరో సినిమా చేయలేదు అని జయప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత ఢీ చిత్రం కోసం మళ్ళీ శ్రీనువైట్ల నుంచి ఫోన్ వచ్చింది. అన్నా మనం ఒక ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్నాము. కాకపోతే ఒక్క డైలాగ్ ఉండదు, సినిమా మొత్తం ఉంటారు. ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే నటించాలి అని చెప్పారు. ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. వెంటనే ఢీ చిత్రానికి ఒప్పుకున్నా. ఆ పాత్ర నాకు సరికొత్త గుర్తింపు తీసుకువచ్చింది, టర్నింగ్ పాయింట్ లాంటిది అని జయప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఢీ చిత్రానికి ముందు శ్రీను వైట్ల మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు చిత్రాన్ని తెరకెక్కించారు. జయప్రకాశ్ రెడ్డి రిజెక్ట్ చేసింది ఈ చిత్రాన్నే. జయప్రకాశ్ రెడ్డి చివరగా సరిలేరు నీ కెవ్వరు, అల్లుడు అదుర్స్, ఆరడుగుల బుల్లెట్ చిత్రాల్లో నటించారు. ఎవడిగోల వాడిది, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, యమదొంగ, కిక్, కందిరీగ, నాయక్ లాంటి చిత్రాలు జయప్రకాశ్ రెడ్డి కెరీర్ లో కీలకమైనవి.