- Home
- Entertainment
- కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని చిరంజీవికి ఇచ్చేయొచ్చు అని రికమండ్ చేసిన నటుడు, చివరికి సుమన్ పై ఆధారపడి..
కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని చిరంజీవికి ఇచ్చేయొచ్చు అని రికమండ్ చేసిన నటుడు, చివరికి సుమన్ పై ఆధారపడి..
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. చిరంజీవి ట్యాలెంట్, ఉత్సాహం తొలినాళ్లలోనే చూసిన కృష్ణం రాజు, మురళి మోహన్ లాంటి సీనియర్లు ఈ కుర్రాడు టాప్ హీరో అవుతాడని అప్పట్లోనే అంచనా వేశారట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. చిరంజీవి ట్యాలెంట్, ఉత్సాహం తొలినాళ్లలోనే చూసిన కృష్ణంరాజు, మురళి మోహన్ లాంటి సీనియర్లు ఈ కుర్రాడు టాప్ హీరో అవుతాడని అప్పట్లోనే అంచనా వేశారట. అదే విధంగా చిరంజీవి నంబర్ 1 హీరో అవుతాడని గెస్ చేసిన నటుల్లో గిరిబాబు ఒకరు.
Megastar Chiranjeevi
గిరిబాబు.. చిరంజీవి కెరీర్, పెళ్లి గురించి ఒక క్రేజీ విషయాన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఆలోచించారట. ఇండస్ట్రీలో చాలా మందిని అడిగి చిరంజీవి గురించి తెలుసుకున్నారట. చిరంజీవి ఎలాంటివాడు ? భవిష్యత్తులో ఇండస్ట్రీలో అతడికి స్థానం ఉంటుందా ? ఇలా చాలా విషయాలు ఆరా తీశారట.
Megastar Chiranjeevi
సీనియర్ నటుడు గిరిబాబుని కూడా అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి అడిగారట. అప్పటికే చిరంజీవి, గిరిబాబు కలసి నటించారు. చిరంజీవి యాక్టింగ్ స్టైల్, డ్యాన్స్ స్కిల్స్ చూసి త్వరలోనే నువ్వు నంబర్ 1 హీరో అవుతావు రాసిపెట్టుకో అని చెప్పారట. ఇదే విషయాన్ని గిరిబాబు అల్లు రామలింగయ్యకి చెప్పారు. టాలీవుడ్ లో చిరంజీవి టాప్ హీరో అవుతాడు. మీ అమ్మాయిని కళ్ళు మూసుకుని చిరంజీవికి ఇచ్చేయండి అని గిరిబాబు చెప్పారట.
చిరంజీవి తనని అన్నయ్య అని పిలుస్తాడని, తాను తమ్ముడు అని అంటానని గిరిబాబు అన్నారు. నీతో ఒక సినిమా నిర్మించాలి అని అడిగిన వెంటనే చిరంజీవికి గిరిబాబుకి డేట్లు ఇచ్చేశారట. కానీ ఎంత ప్రయత్నించినా చిరంజీవికి తగ్గ కాంబినేషన్ కుదరడం లేదు. చిరంజీవితో మెరుపుదాడి అనే చిత్రం ప్లాన్ చేశా. కాంబినేషన్ సెట్ కాకపోవడంతో సుమన్ తో చేయాల్సి వచ్చింది అని గిరిబాబు అన్నారు.