- Home
- Entertainment
- అనసూయ బాటలో బ్రహ్మాజీ.. `అంకుల్` అన్నందుకు కేసు పెడతానంటూ బెదిరింపు.. రంగమ్మత్తతోనే ఆటలా?
అనసూయ బాటలో బ్రహ్మాజీ.. `అంకుల్` అన్నందుకు కేసు పెడతానంటూ బెదిరింపు.. రంగమ్మత్తతోనే ఆటలా?
కామెడీ నటుడుగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న బ్రహ్మాజీ మరోసారి వార్తలొచ్చి ఎక్కారు. నెటిజన్లపై ఏకంగా కేసు వేస్తానంటూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది.

brahmaji
ట్విట్టర్ లో బ్రహ్మాజీ (Brahmaji) తన కొత్త ఫోటోని పంచుకుంటూ `వాట్ హ్యాపెనింగ్` అని పోస్ట్ పెట్టారు. పైనుంచి తీసుకుంటున్న సెల్ఫీ ఫోటోని పంచుకున్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందించారు. `ఏం లేదు అంకుల్` అంటూ బ్రహ్మాజీ పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు. దీంతో మండిపోయాడు బ్రహ్మాజీ. తనదైన స్టయిల్‌లో సెటైర్లు పేల్చాడు.
అంకుల్ అన్న నెటిజన్ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ `అంకుల్ ఏంట్రా.. అంకుల్ నువ్వే. కేసు వేస్తా. ఏజ్, బాడీ షేమింగా ` అంటూ పోస్ట్ చేశారు. అయితే తాను సెటైరికల్‌గా అన్నట్టుగా ఎమోజీని పంచుకున్నారు బ్రహ్మాజీ. సరదాగా ఆయన ఈ పోస్ట్ పెట్టారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది.
అయితే బ్రహ్మాజీ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అనసూయకి కౌంటర్‌గా ఈ పోస్ట్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇటీవల `ఆంటీ` అని తనన పిలిచినందుకు కొంత మంది నెటిజన్లపై అనసూయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. స్క్రీన్ షాట్లు తీసి మరీ వారిపై ఫిర్యాదు చేసింది. `ఆంటీ`తోపాటు తనని వల్గర్ గా దూషించిన వారిపై కూడా అనసూయ కేసు పెట్టింది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సంచలనంగానూ మారింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి సెటైరికల్‌గా రియాక్ట్ కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు బ్రహ్మాజీకి ఝలక్ ఇస్తున్నారు. `ఆంటీ` అన్నందుకు అనసూయ కేసు వేయలేదని, తనని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేసిందని చెప్పారు. అంతేకాదు తోటి కళాకారులకు సపోర్ట్ గా నిలవాల్సింది పోయి కామెడీ చేయడం ఏంటీ బ్రహ్మాజీ అంటూ కౌంటర్లేస్తున్నారు.
అంతేకాదు `మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ` అంటున్నారు. అయితే అనసూయని ట్యాగ్ చేయడం వల్ల వివాదాన్ని మరింత పెంచినట్టువుతుందని, ఆమెని ట్యాగ్ చేయడం సరికాదంటున్నారు. ఇంకొందరు అనసూయపై సెటైర్లా? మీపై కూడా కేసు వేస్తుందేమో చూసుకోండి అంటూ హితవు పలుకుతున్నారు.
ఏజ్ విషయంలో, లుక్ విషయంలో బ్రహ్మాజీపై తరచూ సెటైర్లు పేలుతుంటాయి. యాంకర్ సుమ, బ్రహ్మాజీ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. ఆయన్ని ఏజ్ విషయంలో ర్యాగింగ్ చేస్తూ ఆటపట్టిస్తుంటారు. ఈవెంట్లలో తరచూ ఇలాంటి ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. బ్రహ్మాజీ కొన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా, ఇప్పటికీ యంగ్‌గా ఉండటంతో ఈ పంచ్‌లు, సెటైర్లు పేలుతుండటం విశేషం. మరి కామెడీగా చేసిన బ్రహ్మాజీ పోస్ట్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.