'రవితేజ సినిమా తర్వాతే నాకు భారీ రెమ్యునరేషన్ వచ్చింది..'
Actor Ajay: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు నటుడు విజయ్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అత్యధిక పారితోషికం, తాను సాధించిన విజయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

కెరీర్ గురించి వ్యాఖ్యలు..
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది విలన్లు ఉన్నారు. కానీ నటుడు అజయ్ శైలి వేరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు అజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విక్రమార్కుడు తర్వాత..
రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా మంచి విజయం సాధించిన తర్వాత.. తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయని అన్నాడు నటుడు అజయ్. విక్రమార్కుడు రిలీజ్ అయిన తర్వాత నాలుగైదేళ్ళు తనకు మంచి పారితోషికాలు వచ్చాయన్నాడు.
అత్యధిక పారితోషికాలు ఎందుకంటే..
సినీ రంగంలో అత్యధిక పారితోషికాలు ఎందుకంటే.! బయటి ఉద్యోగాలతో పోలిస్తే, సినీ రంగంలో విజయం సాధిస్తే రాత్రికి రాత్రే భారీగా సంపాదించవచ్చని అజయ్ అభిప్రాయపడ్డాడు. ఒక సగటు ఉద్యోగి నెలకు ఐదు లక్షలు సంపాదించడానికి పది నుంచి ఇరవై ఏళ్ల కెరీర్ అవసరమైతే, సినిమా రంగంలో విజయం సాధించినవారు ఏడాదిలో అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని వివరించాడు.
సహనం, ఓపిక అవసరం..
ఇలా సంపాదించాలంటే సహనం, ఓపిక అవసరం అని.. మొదటి పదేళ్లు ఎలాంటి ఫలితాలు కనబడకపోవచ్చని అజయ్ తెలిపాడు. ఇండస్ట్రీలో విజయం సాధించే శాతం చాలా తక్కువగా ఉంటుందని.. అంతా అనూహ్యంగా జరిగిపోతుందన్నాడు. బయట ఉన్నవాళ్లకు కోట్ల పారితోషికాలు ఎక్కువగా అనిపించినా.. సినిమా కోసం పడే కష్టాలు, పోరాటాలు, సహనం, ఎదురుచూపులు, అలాగే విఫలమైతే ఎదురయ్యే పరిస్థితులు వారికి కనిపించవని అజయ్ తెలిపాడు.
కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు..
తన కెరీర్‌లో విక్రమార్కుడు చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టిందని అజయ్ అన్నాడు. ఈ సినిమా తర్వాత తాను బాగా ఎంజాయ్ చేసిన పాత్రల దాదాపు పది నుంచి ఇరవై ఉన్నాయని తెలిపాడు. అతడు, లక్ష్మీ కల్యాణం, ఆర్య 2, ఇష్క్, బృందావనం చిత్రాలలోని తాను నటించిన పాత్రలు తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు.

