- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: కోడలి మాటలకు ఆశ్చర్యంలో రత్నం.. అభిమన్యు మాటలకి షాకైన మాళవిక!
Ennenno Janmala Bandham: కోడలి మాటలకు ఆశ్చర్యంలో రత్నం.. అభిమన్యు మాటలకి షాకైన మాళవిక!
Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. కష్టంలో ఉన్న ఫ్రెండ్ కి ఏం చేయడానికైనా సిద్ధపడిన ఒక స్నేహితుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వేద ఇంటికి వస్తుంది. యష్ ఎక్కడ ఇంకా రాలేదు అని మాలిని అనగా నాకు క్లినిక్ లో పనుండి వెళ్లాను అత్తయ్య ఆయన ఇంకా రాలేదా అని అంటుంది వేద. ఇంతలోనే తాగి అక్కడికి వస్తాడు యష్. యష్ ని చూసిన రత్నం గంట ముందే నిన్ను పొగిడాను. ఇప్పుడు నిన్ను తిట్టుకునేలా చేసుకుంటున్నావు అని కోపంగా అంటాడు. సారీ ఎక్కువ తాగాను అని అంటాడు యష్.
నేను తిడుతుంది నీ తాగుడుకి కాదురా నీ వాగుడికి అని గట్టిగా అనేసరికి వేద అక్కడికి వచ్చి మావయ్య మీరు మీ కొడుకుని కాదు నా భర్తని కూడా అంటున్నారు నా కళ్ళ ముందు నా భర్తని అంటే నేను తట్టుకోలేను. ఇది కరెక్ట్ కాదు అని అంటుంది.అప్పుడు రత్నం నీ మాటలతో ఎదుటివారిని ఎంత బాధ పెడుతున్నావో అర్థం చేసుకుంటున్నావా అని యష్ ని అంటాడు. మీరు చెప్పిన విషయం కరెక్టే కాని చెప్పాల్సింది నాకు కాదు మరొకరికి అని వేదవైపు చూసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు చేస్తున్న పనికి నాకు చంప మీద కొట్టాలని ఉంది.
కానీ నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. ఎందుకు అంత ప్రేమ చూపించి ప్రతిసారి వాడిని వెనకేసుకొని వస్తున్నావు. అయినా నాకు నువ్వంటే ఇష్టమే అసలు కోపం రాదు అని వేదని హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. ఆ తర్వాత సీన్లో అభిమన్యు, చిత్ర ఫోటోని లాప్టాప్ లో చూస్తూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మన బంగారు జీవితం ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో ఫోన్ వచ్చి బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మాళవిక వచ్చి చిత్ర ఫోటో చూస్తుంది.
చిత్ర ఫోటో ఇక్కడ ఎందుకు ఉన్నది అని అడగగా చిత్రని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు అభిమన్యు. ఆ మాటలకు మాళవిక షాక్ అవుతుంది. ఊరికినే బంగారం ఏప్రిల్ ఫూల్ చేశాను. ఎంప్లాయిస్ అందరికి ఫోటోలు ప్రెసెంటేషన్ కి ఇవ్వాలి కదా అందుకే చిత్ర ఫోటో కూడా కలెక్ట్ చేశాను అని అంటాడు. నా జీవితంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు బంగారం.
ఇంకెవరూ లేరు వద్దు కూడా అని చెప్పి మాళవిక ని హత్తుకుంటాడు. ఈరోజు కైతే తప్పించుకున్నాను ఏదో ఒకరోజు బాంబు పేలాల్సిందే అప్పుడు నీ మొఖం చూడాలి అని నవ్వుకుంటూ అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో యష్ గదిలో ఉండగా వేద భోజనం పట్టుకుని వస్తుంది. రండి కొంచెం భోజనం తినండి అని అనగా నాకు వద్దు అని యష్ అంటాడు.బలవంతంగా తినిపిద్దామని చూడగా ప్లేట్ ని కింద కి కొట్టి పారేస్తాడు యష్. ఎందుకు ఇక్కడికి వచ్చావు కావాలనే వచ్చావా మైండ్ లో ఆలోచనలు ఎక్కడో ఉంటాయి కదా అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు మనది వన్ ఇయర్ అగ్రిమెంట్ ఏ కదా నేను ఎవరిని? నీ భర్తని కాదు కదా.
ఇది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే కదా నాకేం హక్కు లేదు కదా అని అంటాడు. ఉంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకే ఇవన్నీ భరిస్తున్నాను అని అనగా అవి మాటల్లో కాదు నా కళ్ళ ముందు జరిగే నిజాలకి నువ్వు చెప్పిన మాటలకు ఎటువంటి సంబంధం లేదు అని వేద చేతిని గట్టిగా పట్టుకుని హార్ష్ గా మాట్లాడుతాడు యష్. బాధపడిన వేద అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూసేసరికి కరెంటు పోతుంది.
ఇంతలో యష్ తలుపు దగ్గరకు వేసి వేద దగ్గరికి వచ్చి షర్ట్ బట్టలు తీస్తూ నేను నీ భర్తని అని ఇప్పటివరకు చాట భారతం చెప్పావు కదా అయితే భర్తనే కదా నిన్ను ముట్టుకోకూడదా అని దగ్గరికి వస్తే వేద యష్ ని తోస్తుంది. ఏం ఇంకెవరి దగ్గరకైనా వెళ్లడానికి అపాయింట్మెంట్ తీసుకున్నావా ఈ రాత్రికి అని అనగా ఆ మాటలకి కోప్పడ వేద యష్ చెంప చెళ్ళుమనిపిస్తుంది. తరువాయి భాగంలో యష్ తాగి డ్రైవ్ చేస్తూ ఆక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరతాడు.