- Home
- Entertainment
- Intinti gruhalakshmi: ఆహ్వాన పత్రిక మీద సామ్రాట్ పేరు చూసి కోపంతో అభి... లాస్య మాటలకు బానిస కానున్నాడా?
Intinti gruhalakshmi: ఆహ్వాన పత్రిక మీద సామ్రాట్ పేరు చూసి కోపంతో అభి... లాస్య మాటలకు బానిస కానున్నాడా?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆహ్వాన పత్రిక పైన తన పేరు వేసినందుకు తులసి ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. ధన్యవాదాలు సామ్రాట్ గారు అని తులసి అనగా, కష్టం మీది, ఫలితం మీది, ప్రయత్నం మీది అని సామ్రాట్ అంటాడు. కానీ డబ్బు, సహాయం మీది ధన్యవాదాలు అని చెప్తుంది. అప్పుడు పరంధామయ్య ఇందులో పేరు రావడానికి సామ్రాటే కారణం అవ్వచ్చు కానీ ఆ పేరు ఎప్పుడూ నిలబెట్టుకోవడంకి బాధ్యత మాత్రం నీదే అని అంటాడు. అంతట్లో తులసి నేను వెంటనే ఇంట్లో వాళ్ళుకు విషయం చెప్తాను అని ఆనందపడుతుంది. ఆ తర్వాత సీన్లో అనసూయ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా నందు లాస్యలు అక్కడికి వచ్చి తులసి కోసం అడుగుతారు.
అప్పుడు అనసూయ, పిచ్చి మొక్కలు ఎప్పుడు తీసేసినా మల్లి వచ్చేస్తూ ఉంటాయి అని ఎటకానిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చారు అని అడగగా బిజినెస్ పని మీద వచ్చాము అని వాళ్ళు అంటారు. తులసి ఏది అని లాస్య అభితో అనగా ఫోన్ వచ్చి వెంటనే బయలుదేరింది.ఎక్కడికి వెళ్లిందో కూడా తెలీదు అని అంటాడు అభి. ఇంట్లో సామ్రాజ్యం అంతా తనదే కదా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని లాస్య అంటుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్,మాకు స్వీట్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి అని అంటాడు. అప్పుడు సామ్రాట్, తులసి ఇద్దరు కలిపి వాళ్ల కోసం స్వీట్ చేస్తారు.
ఆ తర్వాత సీన్లో లాస్య, నందుతో సామ్రాట్ ఇంటికే వెళ్లి ఉంటాది ఇంత ఉదయాన్నే ఏం చేస్తున్నారో అని రెచ్చగొడుతూ ఉంటుంది.ఇంతట్లో స్వీట్ చేసి తులసి ఆనందంతో ఇంటికి వచ్చి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఇంతట్లో నందు లాస్యలను చూసి మొఖం మార్చేస్తుంది ఎక్కడికి వెళ్లావు అని లాస్య అడగగా సామ్రాట్ ఇంటికి వెళ్లాను అని అంటుంది. ఇంత ఉదయాన్నే వెళ్లాల్సిన అవసరం ఏమిటో అని లాస్య ఎటకకారిస్తూ ఉండగా పరంధామయ్య అక్కడికి వచ్చి నేను సామ్రాట్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తులసికి రమ్మని ఫోన్ చేశాను అని అంటాడు.
ఇంతట్లో నందు మీరు అక్కడికి వెళ్లి వెళ్లారు నాన్న అని అడగగా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.నువ్వు ఏమి నన్ను పోషించట్లేదు అని గీరగా సమాధానం చెప్పాడు. దానికి నందు మొఖం మడ్చేస్తడు. ఇంతట్లో ఏమైంది అని అనసూయ అడగగా భూమి పూజ కోసం ఆహ్వాన పత్రిక వచ్చింది అని ఆనందంగా చెప్తుంది తులసి. లాస్య నందులు మాటవరసకైనా సామ్రాట్ గారు మనకి ఈ విషయం చెప్పలేదు అని అనుకుంటారు. ఇంతట్లో నా పేరు కూడా పడింది అందరూ చూడండి అని తులసి అంటుంది. అప్పుడు ఇన్విటేషన్ కార్డ్ లాస్య చూసి కింద సామ్రాట్ పేరు కూడా ఉన్నది అచ్చు దంపతుల్లాగే అని ఎటకారుస్తుంది.
అభి దాన్ని చూసి నీ పేరు ఉందని సంతోషపడుతున్నావు.కింద ఆయన పేరు ఉండడం ఎందుకు అని అడుగుతాడు. దానికి తులసి, ఆయనే కదా బాస్ అని అంటాది. ఆయన కంపెనీకి బాస్.నీకు బాస్ కాదు అని ఆ కార్డ్ నీ చింపేసి, మనం అక్కడికి వెళ్లడం లేదు అని అభి అంటాడు. ఇంతట్లో పరంధామయ్య అభిని కొట్టబోయి నీ తల్లిని అర్థం చేసుకోవడం నీకు ఇంకా జన్మలో రాదు. రేపు అందరం కలిసి భూమి పూజకు వెళ్తున్నాము ఇదే నా మాట అని అంటాడు. అనసూయ కూడా పరంధామయ్యకే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు తులసి అభితో నేను ప్రతి ఒక్కరూ మాట వినే తులసిని కాదు.
ఇప్పుడు మారిపోయాను నేనేం చేయాలనుకుంటున్నాను అదే చేస్తాను నేను ఎవరి మాట వినను నేను రేపు వెళ్తున్నాను అని కళాకండిగా చెప్పేస్తుంది. దానికి పరంధామయ్య తులసి ధైర్యాన్ని అభినందిస్తాడు. తర్వాత తులసి ఆ కింద పడిపోయిన ఆహ్వానం పత్రికలు చూసి బాధపడుతూ ఉంటుంది. సామ్రాట్ లాస్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్లో సామ్రాట్, తులసి చేసిన స్వీట్ ని తింటూ చాలా బాగుంది అనుకుంటారు.మరి ఇలాంటి స్వీట్లు కావాలంటే ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా రా అని వాళ్ళ బాబాయ్ అనగా ఇప్పుడా మాటలు ఎత్తొద్దు బాబాయ్ అని అంటాడు.
ఇలా కాదురా హనీ కూడా అమ్మ ఉండాలి కదా తులసి లాంటి అమ్మాయిని నేను వెతికి పెడతాను నీకు ఓకే కదా అని అనగా మీ ఇష్టం బాబాయ్ అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత సీన్లో తులసీ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆహ్వాన పత్రిక చిరిగినంత మాత్రాన నీ ఆశలు చెరిగిపోయినట్టు కాదు, పరిస్థితులు మారుతున్నాయి వాళ్లు అర్థం చేసుకుంటారు.మంచేదో, చేయదో వాళ్లకి తెలుసు. అప్పటివరకు ఇలా ఉండక తప్పదు అని తనతో తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ ఒక మూల నుంచి దివ్య చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!