MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమీర్‌ ఖాన్‌ విలన్‌.. దీపికా హీరోయిన్‌.. మహేష్‌ కోసం టార్గెట్‌ ఫిక్స్ చేసిన రాజమౌళి?

అమీర్‌ ఖాన్‌ విలన్‌.. దీపికా హీరోయిన్‌.. మహేష్‌ కోసం టార్గెట్‌ ఫిక్స్ చేసిన రాజమౌళి?

టాలీవుడ్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహేష్‌- రాజమౌళి ల కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్. ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు వస్తున్నాయి. దేనిపై ఓ క్లారిటీ లేదు. తాజాగా ఇండియన్‌ సినిమా షేక్‌ అయ్యే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 06 2023, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

`ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి ఆస్కార్‌ మూవీ తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా(SSMB29)పై ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాజమౌళి.. మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్లు ఇచ్చారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగుతుందని, మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని అన్నారు. ఇండియానా జోన్స్ ని పోలి ఉంటుందన్నారు. అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తారని, హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ భాగం కాబోతుందని అన్నారు. 
 

25

ఇక కాస్టింగ్‌కి సంబంధించి రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. కాస్టింగ్‌ కి సంబంధించిన వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇందులో నటించబోతున్న యాక్టర్స్ గురించిన ఓ రూమర్స్ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసేలా ఉండటం విశేషం. ఇందులో అమీర్‌ ఖాన్‌, దీపికా పదుకొనెల పేర్లు తెరపైకి వచ్చాయి. 
 

35

మహేష్‌బాబుకి విలన్‌గా అమీర్‌ ఖాన్‌ నటిస్తారనేది లేటెస్ట్ అప్‌డేటేడ్‌ రూమర్‌. రాజమౌళి ఇప్పటికే మంతనాలు జరిపారని, అమీర్‌ ఖాన్‌ నుంచి పాజిటివ్‌ నోట్‌ వచ్చిందని అంటున్నారు. మరోవైపు మహేష్‌కి హీరోయిన్‌గా దీపికా పదుకొనెని ఫైనల్‌ చేశారని సమాచారం. ఈ వార్త నెట్టింట వైట్‌ అవుతుంది.హాట్‌ టాపిక్‌గానూ మారింది. ఆమీర్‌ ఖాన్‌ లాంటి ఇండియన్‌ యాక్టర్‌, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ ఇందులో నటిస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ మరింతగా పెరిగిపోతుంది. ఇక అంతో కొంత గ్లోబల్‌ ఇమేజ్‌ ఉన్న దీపికా పదుకొనె సైతం హీరోయిన్‌ అంటూ దానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. 
 

45

మరి ఇందులో నిజమెంతా అనేది పక్కన పెడితే ఇప్పుడీ వార్త మాత్రం మహేష్‌ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. మరోవైపు అమీర్‌ ఫ్యాన్స్ సైతం సంబరపడేలా ఉంది. అమీర్‌ ఖాన్‌ ఓ పాత్ర చేశారంటే అది ఎంతటి బలంగా, ఇంపాక్ట్ చూపించేలా ఉంటుందో తెలిసిందే. ఈ వార్త నిజమైతే ఆయన పాత్ర హీరోకి ఏమాత్రం తక్కువగా ఉండదని చెప్పొచ్చు. ఇద్దరు మహా శక్తివంతులు ఢీ కొడితే ఎంతటి రణరంగం ఉంటుందో మహేష్‌ కి, విలన్‌ అమీర్‌ అనే వార్త అలాంటి ఫీలింగ్‌నే తెప్పిస్తుంది. అయితే ఈ వార్త నిజం అయితే బాగుందని అభిమానులు కోరుకుంటున్నారు. నిజానిజాలు తేలడానికి ఇంకా ఆరు నెలలైనా పడుతుంది. 
 

55

ప్రస్తుతం రైటర్‌ విజయేంద్రప్రసాద్‌.. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇంకా సగమే స్క్రిప్ట్ వర్క్ అయ్యిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ వరకుగానీ ఈ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి రాదని టాక్‌. మరి రాజమౌళి ఎంత ఫాస్ట్ గా తీసుకొస్తాడో చూడాలి. అయితే ఇందులో చాలా వరకు మహేష్‌ పాత్రకి సీజీ వర్క్ ఉంటుందని, మహేష్‌ రిలాక్స్ అయిపోవచ్చనే టాక్‌ వినిపిస్తుంది. రాజమౌళి సినిమా అంటే నటులను పిండేస్తాడు. అలాంటిది అంత రిలాక్డ్స్ గా ఎలా వదిలేస్తాడనేది ప్రశ్న. మరి వాస్తవాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image3
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved