- Home
- Entertainment
- Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి రెడీ అవుతున్న అమీర్ ఖాన్. అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ కాదు
Aamir Khan Third Marriage: మూడో పెళ్లికి రెడీ అవుతున్న అమీర్ ఖాన్. అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ కాదు
Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అమీర్ ఖాన్ తదుపరి పెళ్లి
Aamir Khan Third Marriage Rumors: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. జునైద్ ఖాన్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. ఐరాకు గతేడాది పెళ్లయింది. అమీర్ ఖాన్ 2002లో రీనా దత్తాకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే.
రెండుసార్లు విడాకులు తీసుకున్న అమీర్
రీనాతో విడిపోయాక కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు. ఈ పెళ్లి కూడా విడాకులతో ముగిసింది. 2021లో కిరణ్ రావుకు విడిపోతున్నట్టు ప్రకటించారు. రెండుసార్లు విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న అమీర్ మళ్ళీ ప్రేమలో పడ్డారట. ఆ మధ్య బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో పడ్డారని, ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి.
అమీర్ మూడో పెళ్లి ఎవరితో?
కానీ అందరికి షాకిస్తూ ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో అమీర్ ప్రేమలో పడ్డారట. బెంగళూరుకు చెందిన ఓ యువతితో అమీర్ ప్రేమాయణం నడుపుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్. అయితే అమీర్ మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. 60 ఏళ్ళలో మూడో పెళ్లా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
అమీర్ తదుపరి సినిమా
అమీర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' డిజాస్టర్ అయ్యాక రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అమీర్ ధీమా వ్యక్తం చేశారు.