అమీర్ ఖాన్, గౌరీ రిలేషన్‌షిప్ పై కూతురు ఐరా షాకింగ్ రియాక్షన్, ఫోటోలు వైరల్
Aamir Khan ఫ అమీర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌ని బయటపెట్టాడు, ఐరాతో కనిపించాడు. ఐరా టెన్షన్ చూసి రకరకాల ఊహాగానాలు, కూతురు సంతోషంగా లేదేమో?

Aamir Khan
బర్త్‌డే సెలెబ్రేషన్స్‌కి ముందు రోజు రాత్రి అమీర్ ఖాన్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రట్‌ని అందరి ముందుకి తెచ్చి సంచలనం సృష్టించాడు.

Aamir Khan
తాను 18 నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అమీర్ ఖాన్ మీడియాకి చెప్పాడు. కానీ పెళ్లి గురించి అడిగితే 60 ఏళ్ల వయసులో అది బాగోదని అన్నాడు.

Aamir Khan
తామిద్దరం ఒకరికొకరు 25 ఏళ్లుగా తెలుసని అమీర్ ఖాన్ చెప్పాడు. మధ్యలో గ్యాప్ వచ్చినా, ఏడాదిన్నరగా మళ్లీ దగ్గరయ్యామని తెలిపాడు.

Aamir Khan, ira Khan
ఈ మధ్య అమీర్ ఖాన్, కూతురు ఐరా ఖాన్ ఒకే లొకేషన్‌లో కనిపించారు. తండ్రి ఇలా తన గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రకటించిన తర్వాత ఐరా రియాక్షన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Ira Khan
తండ్రి అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన తర్వాత ఐరా చాలా సీరియస్‌గా కనిపించింది. ఆమె మొహంలో టెన్షన్ క్లీయర్‌గా కనిపిస్తుంది. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Aamir Khan, Ira Khan
అమీర్ ఖాన్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన తర్వాత ఐరా ఖాన్ ఒక క్రిప్టిక్ నోట్ కూడా బయటకి వచ్చింది. ఇదిప్పుడు వైరల్ అవుతుంది.

Ira Khan
ఐరా ఒక స్టోరీ పోస్ట్ చేసింది, అందులో బ్రౌజర్‌లో చాలా ట్యాబ్‌లు ఓపెన్ చేసి ఉన్నాయి. 'నీ మైండ్‌లో ఏం జరుగుతోంది?' అని క్యాప్షన్ కూడా పెట్టింది.

Ira Khan
ఇప్పుడు ఐరా ఖాన్ తన తండ్రి అమీర్ ఖాన్‌తో ఒక లొకేషన్‌లో కనిపించింది. ఆమె షాక్ అయినట్టు, సీరియస్‌గా ఉంది.

aamir khan
అమీర్ ఖాన్ కూడా తన కూతురికి ఏదో సర్దిచెబుతున్నట్టు కనిపించాడు. తన ప్రేమ విషయం చెప్పడం పట్ల ఆమె సీరియస్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమెని అమీర్ ఖాన్ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి షాకిస్తున్నాయి.
read more: స్టార్ యాంకర్ కొంపముంచిన `బిగ్ బాస్` షో.. డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో
also read: `ఉప్పెన` విలన్‌తో పూరీ జగన్నాథ్ సినిమా.. ఛార్మి స్థానంలో కొత్త ప్రొడక్షన్, క్రేజీ డిటెయిల్స్

