MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • స్టార్‌ యాంకర్‌ కొంపముంచిన `బిగ్‌ బాస్‌` షో.. డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో

స్టార్‌ యాంకర్‌ కొంపముంచిన `బిగ్‌ బాస్‌` షో.. డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో

Shilpa Chakravarthy: ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న శిల్పా చక్రవర్తి వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 17 2025, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
shilpa chakravarthy

shilpa chakravarthy

Shilpa Chakravarthy: శిల్పా చక్రవర్తి ఒకప్పుడు యాంకర్‌గా రాణించిన విషయం తెలిసిందే. టీవీ షోస్‌, సీరియళ్లు, ఈవెంట్లు చేస్తూ ఆకట్టుకుంది. అప్పట్లో సుమ, ఉదయభానులకు పోటీగా ఆమె రాణించింది. కానీ చాలా కాలంగా ఆమె టీవీకి దూరమయ్యింది.

మధ్యలో `బిగ్‌ బాస్‌ తెలుగు 3`లో మెరిసింది. అందులో రచ్చ చేసింది. కానీ మళ్లీ కనిపించలేదు. దీంతో ఆమెని జనాలు మర్చిపోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లకి బయటకు వచ్చింది శిల్పా చక్రవర్తి. ఏడేళ్లు తాను పడ్డ స్ట్రగుల్స్ గురించి వెల్లడించింది. ఎమోషనల్‌ అయ్యింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
shilpa chakravarthy

shilpa chakravarthy

ఈ సందర్భంగా శిల్పా చక్రవర్తి కన్నీళ్లు పెట్టుకుంది. తనని దారుణంగా ట్రోల్‌ చేశారంటూ, బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారని వాపోయింది. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు చెప్పింది.

అంతకు ముందు విమర్శలు వచ్చినా పట్టించుకోలేదని, కానీ ఓ షో(బిగ్‌ బాస్‌) తర్వాత తనని దారుణంగా ట్రోల్‌ చేశారని, ఆ కామెంట్లు విన్నాక తనపై తనకు నమ్మకం పోయిందని, దీంతో చాలా కుంగిపోయానని, ఇక ఈ జీవితం వద్దు అనేస్థితికి వెళ్లిపోయినట్టు చెప్పింది శిల్పా చక్రవర్తి. 

36
shilpa chakravarthy

shilpa chakravarthy

తాను అంతకు ముందు యాంకర్‌గా షోస్‌ చేశాను. ఆడియెన్స్ ఎంతగానో ఆదరించారు. కానీ పిల్లల కోసం కొంత బ్రేక్‌ తీసుకున్నాను. ఆ తర్వాత కమ్‌ బ్యాక్‌ కావాలనుకున్నాను. ఆ సమయంలోనే ఓ రియాలిటీ షో(బిగ్‌ బాస్‌) ఆఫర్‌ వచ్చింది. సరదాగా వెళ్దామని వెళ్లాను. అందులో కూడా చాలా మంది నాపై రకరకాలుగా కామెంట్లు చేశారు.

ఆ సమయంలో ఏం జరిగిందో మీకు తెలిసిందే. కానీ షో నుంచి బయటకు వచ్చాక ఆ షోలో జరిగింది చూస్తే తనపై ఇలాంటి అభిప్రాయం ఉందా? అనే ఫీలింగ్‌ కలిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు చూస్తే షాక్‌ అయినట్టు తెలిపింది శిల్పా చక్రవర్తి. 
 

46
shilpa chakravarthy

shilpa chakravarthy

తనకు తెలుగు రాదు, కానీ తన బావ(భర్త) అవి చదివి చెప్పమంటే ఆయన వద్దు నువ్వు బాధపడతావని చెప్పాడు. అయినా వాటిని చదివితే చాలా దారుణంగా తిడుతూ కామెంట్లు పెట్టారు. నేను దేనికి పనికి రాను అనేలా కామెంట్లు ఉన్నాయి. ఆ సమయంలో ఆ కామెంట్లు చూసి చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను.

దాన్నుంచి బయటకు రావడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఆఫర్లు లేవు, షోస్‌ లేవు, ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీనికితోడు కరోనా వచ్చింది. ఆ సమయంలో తన భర్త వ్యాపారం కూడా క్లోజ్‌ అయ్యింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆయన్ని కూడా కాపాడుకోలేకపోయాను. ఆ దెబ్బతో మరింతగా డిప్రెషన్‌లోకి వెళ్లాను. 
 

56
shilpa chakravarthy

shilpa chakravarthy

కరోనా తర్వాత కోలుకుంటున్న దశలో అమ్మకి క్యాన్సర్‌ అని తెలిసింది. ఆమెకి ట్రీట్‌ మెంట్‌ ఇప్పించాం. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆ తర్వాత తెలిసినవాళ్లే నానా రకాలుగా మాట్లాడారు. షోస్‌ చేయడం లేదా? ఇంట్లోనే ఉంటున్నావా? అంటూ చిన్న చూపు చూస్తూ మాట్లాడారు.

వారి మాటలు కూడా చాలా బాధపెట్టాయి. బంధువులే సూటిపోటి మాటలు మాట్లాడారు.  ఇలా ఏడేళ్లపాటు నరకం చూశాను. వాటిని అన్నింటిని భరించాను, దాన్నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాను. 
 

66
shilpa chakravarthy

shilpa chakravarthy

నెమ్మదిగా కోలుకుంటూ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నాను. మళ్లీ సీరియల్స్, టీవీ షోస్‌ చేస్తున్నాను అని తన కమ్‌ బ్యాక్‌ వీడియోని పంచుకుంది శిల్పా చక్రవర్తి. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమెని ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు.

మీరు స్ట్రాంగ్‌గా ఉండాలని, మంచి మనసు మీది అని, మంచి టాలెంట్‌ పర్సన్‌ అని, బెస్ట్ యాంకర్‌ అంటూ ఆమెకి బూస్ట్ ఇస్తున్నారు. మొత్తంగా అనేక స్ట్రగుల్స్ నుంచి బయటపడి మళ్లీ మనల్ని అలరించడానికి రాబోతుంది శిల్పా చక్రవర్తి. 

read  more: `ఉప్పెన` విలన్‌తో పూరీ జగన్నాథ్‌ సినిమా.. ఛార్మి స్థానంలో కొత్త ప్రొడక్షన్‌, క్రేజీ డిటెయిల్స్

alsoread: సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved