బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు, సుప్రిత ఏం తప్పు చేసిందో తెలుసా?
నటి సురేఖ వాణి కూతురు సుప్రిత జనాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. మరి ఇంతకి సుప్రియ ఏం తప్పు చేసిందంటే?

supritha
సీనియర్ నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కామెడీ పాత్రలతో మెప్పించింది. హీరోహీరోయిన్లకి వదినగా, అక్కగా నటించి మెప్పించింది. ఎక్కువగా బ్రహ్మానందంతో జోడి కట్టి ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది.
అయితే ఇటీవల అవకాశాలు తగ్గాయి. అడపాదడపా మాత్రమే కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తన కూతురు సుప్రితతో కలిసి ఆమె చేసే రచ్చ వేరే లెవల్. సోషల్‌మీడియా ద్వారానే బాగా సంపాదిస్తుంది. ఈ విషయంలో కూతురు స్పీడుమీదుందని చెప్పొచ్చు.
సురేఖవాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఓ మూవీ కూడా చేస్తుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్, టీవీ నటుడు అమర్ దీప్ హీరో. వీరి కాంబినేషన్‌లో సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. కానీ ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు.
అయితే అమ్మ సురేఖ వాణి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుప్రిత విదేశాలకు వెళ్తూ, అక్కడి బ్లాగ్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పార్టీ పిక్స్ తోనూ ఆకట్టుకుంటుంది. దీనితోడు గ్లామర్ ఫోటోలతోనూ అలరిస్తుంది. వీటితోపాటు కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది.
supritha
ఇదిలా ఉంటే తాజాగా ఆమె జనాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. హోలీ పండుగ రోజు సుప్రియ అభిమానులకు, జనాలకు సారీ చెప్పడం విశేషం. మరి ఆమె ఏం తప్పు చేసింది? ఎందుకు సారీ చెప్పిందనేది చూస్తే, చాలా మంది సెలబ్రిటీలు ఇన్‌ఫ్లూయెన్సర్స్ గా మారి బెట్టింగ్ యాప్‌లను ఎంకరేజ్ చేశారు.
డబ్బుల కోసం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చే చాలా యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాటిలో చాలా వరకు మోసాలే ఉంటున్నాయి. చాలా మంది అమాయకులు ఆ యాప్‌లు చేసే ఫ్రాడ్‌కి మోసపోతున్నారు. ఇలాంటి సెలబ్రిటీలు చేసే యాడ్స్ ని జనాలు ఫాలో అవుతుంటారు. అంతిమంగా మోసపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు చాలా పెరిగిపోతున్నాయి.
supritha
ఈ నేపథ్యంలో ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఇన్ ఫ్లూయెన్సర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత తాను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్టు తెలిపింది. తెలిసో తెలియకో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో తాను కూడా ఉన్నానని, ఇప్పుడు అవన్నీ ఆపేశానని, అందుకు అందరికి సారీ అని చెప్పింది.
supritha
ఎవరైనా ఇన్ ఫ్లూయెన్సర్లు బెట్టింగ్‌యాప్‌లు ప్రమోట్ చేస్తుంటే వాటిని చూసి ఫాలో అవ్వద్దని, వాటికి ఎంకరేజ్ చేయోద్దని, వాటికి అలవాటు పడొద్దని, వాటిని డిలీట్ చేసుకోవాలని తెలిపింది సుప్రిత. అలాంటి వారిని ఫాలో కూడా కావద్దని, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
ఈ సందర్భంగా అందరికి మరోసారి సారీ అని చెప్పింది సుప్రిత. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఈ వీడియోని పోస్ట్ చేసింది. డబ్బుల కోసం చేసి తప్పులు నెమ్మదిగా మెడకు చుట్టుకోవడంతో తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది సుప్రిత.
read more: నాగార్జున, మహేష్ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్
also read: శోభన్ బాబు, జయలలితలా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన టాలీవుడ్ జంట ఎవరో తెలుసా? ఇప్పటికీ టచ్‌లోనే