MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమని కు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు...ఎవరికీ చెప్పుకోలేని చోట చూపాలంటూ ఒత్తిడి

ఆమని కు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు...ఎవరికీ చెప్పుకోలేని చోట చూపాలంటూ ఒత్తిడి

జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని.. నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమని తెలిపారు. 

3 Min read
Surya Prakash
Published : Apr 20 2024, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112


ఆమని ఓ తరంలో ఆమె నటన కోసం సినిమాకు వెళ్లే జనం ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్  ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ డమ్ ను అందుకుంది. గ్లామర్ తో తన తోటి హీరోయిన్స్ దూసుకుపోతూ  గట్టి పోటీ ఇస్తున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆమని దాన్ని పట్టించుకోకుండా నటననే నమ్ముకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెరపై సంప్రదాయ పాత్రలు చేస్తూ అచ్చతెలుగు తనానికి బ్రాండ్ లా కనిపించే ఆమెను సైతం కొన్ని కాస్టింగ్ కౌచ్ విషయాలు ఇబ్బంది పెట్టాయంటే నమ్మగలమా ..ఆ మధ్యన ఓ యూట్యూబ్  ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. 
 

212


తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసనగా హీరోయిన్‌గా నటించి మెప్పించారు నటి ఆమని. తన నటనాభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారవిడ. తెలుగునాట అక్కినేని నాగేశ్వరరావు మొదలు, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, సుమన్, నరేష్, జగపతి బాబు వంటి ప్రముఖ హీరోల సరసన నటించారు. నటి సౌందర్యతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు.  

312


జంబలకిడిపంబ,శుభలగ్నం,శుభసంకల్పం,ఆ నలుగురు,పచ్చని సంసారం,ప్రియమైన శ్రీవారు, మావిచిగురు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.ప్రస్తుతం తెలుగు , తమిళ కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారామె. ఆమని తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టారు. 

412


ఆమమని మాట్లాడుతూ..నా కెరీర్ తొలినాళ్లలో చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఆమె తెలిపారు. ఓ తమిళ దర్శకుడు నన్ను ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అంటూ బహిరంగంగా అడిగాడు..దీంతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు. బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్లు కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారని ఈ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చారు. 

512


అయితే పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో నటీనటులతో చాలా బాగా ఉంటారని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారని ఆమని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాల విషయంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటాయని ఆమని పేర్కొన్నారు. జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని.. నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమని తెలిపారు.

612


ఈ క్రమంలో ఆమని కెరియర్ లోనే పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా పలు విషయాలను తెలియజేసింది.. కాస్టింగ్ కౌచ్ పై ఆమని మాట్లాడుతూ హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని అప్పట్లో ఎక్కువగా సోషల్ మీడియా లేదు అందుకే ఎవరికి తెలియకపోయేది అంటూ తెలిపింది.

712

ఏ వృత్తిలోనైనా సరే మంచి చెడులు అనేవి ఉంటాయి హీరోయిన్గా అది మనం డెసిషన్ తీసుకోవాలి తమిళ ఇండస్ట్రీలో ఒకసారి తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అని తెలిపింది. ఒకసారి స్విమ్మింగ్ పూల్ చేసే సీన్ కోసం డ్రెస్ తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అని కోరారట..కానీ తను మాత్రం అందుకు ఒప్పుకోలేదని అలాంటివారు కేవలం వాటి కోసమే వస్తారు నేను వెంటనే అలాంటి క్యారెక్టర్ ని చేయనని చెప్పానని తెలిపింది.

812


కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన సమయంలోనే ఫోన్ చేసి డైరెక్టర్ స్టొరీ గురించి మాట్లాడాలన్నారు మీరు రావాలంటే ఒక మేనేజర్ ఫోన్ చేశారట. కానీ ఈ విషయాలు తనకు చాలా రోజులకు అర్థమయిందని తెలిసింది. ఇప్పట్లో సెల్ ఫోన్లు లేవు కేవలం డైరెక్ట్ గా  మేనేజర్ వచ్చి మాట్లాడేవారని తెలిపింది ఆమని. అలాంటి సమయంలో మరొకరు ఫైనాన్షియల్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటున్నారు రమ్మని చెప్పారట.. 

912


అందుకు తను డైరెక్టర్ నిర్మాత చూస్తే చాలు కదా ఇంకా ఎక్కువ అంటే హీరో చూడాలి కానీ ఫైనాన్స్ చూడడం ఏంటి అంటూ తనకు అనుమానం వచ్చిందని ఆ తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా అర్థమయిందని ఒకసారి తన తల్లిని తీసుకువస్తూ ఉంటే వద్దు మీరు ఒక్కరే రమ్మని చెప్పారట దీంతో అయాం సారీ నేను రానని చెప్పేశానని తెలిపింది ఆమని.

1012


అలాగే "నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లను దాటుకుని నా వరకూ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలి. అలా రావడానికి కారణం భగవంతుడి దయగానే నేను భావిస్తాను. ఇప్పటికీ నేను భగవంతుడినే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు. 

1112


ఇక "నేను సినిమాల్లోకి రావడం మా ఫాదర్ కి ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ తరువాత నా ఇష్టాన్ని గమనించి అంగీకరించారు. నేను హీరోయిన్ గా కూడా నిలదొక్కుకోగలనని నమ్మారు. అలాగే నేను 'మిస్టర్ పెళ్ళాం' తరువాత దూసుకుపోయాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. హీరోయిన్ గా నా స్టార్ డమ్ ను మా ఫాదర్ చూడలేదనే ఒక బాధ నాకు ఇప్పటికీ ఉంది" అన్నారు. 

1212

 మెగాస్టార్‌తో నటించలేదనే బెంగ తనకు ఉండేదని, అయితే ఒకసారి తనకు చిరుతో నటించే అవకాశం వచ్చిందని చెప్పిన ఆమని.. ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని అన్నారు. దానికి కారణం.. ఆ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించమని కోరటమేనట. మెగాస్టార్‌ని చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్‌ బోయ్‌ లా భావించానని, అలాంటిది చిరుకి సోదరిగా తాను నటించడం కుదరని పని అని, ఆ కారణంగానే ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని ఆమని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆమని తెలిపారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image2
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Recommended image3
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved