MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌బాస్‌5లో `ఆకలిరాజ్యం`.. కన్నీళ్లు పెట్టించిన నటరాజ్‌ మాస్టర్‌, విశ్వ, రవి, లోబో

బిగ్‌బాస్‌5లో `ఆకలిరాజ్యం`.. కన్నీళ్లు పెట్టించిన నటరాజ్‌ మాస్టర్‌, విశ్వ, రవి, లోబో

బిగ్‌బాస్‌5లో 24వ రోజు(బుధవారం) ఎపిసోడ్‌లో `ఆకలిరాజ్యం` ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. వెయిట్‌ లాస్‌ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్‌ విలువని, ఆకలి బాధలను చూపించాడు బిగ్‌బాస్‌. ఇది హైలైట్‌గా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 29 2021, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా వెయిట్‌ తగ్గితే గెలుపు మీదే అన్నారు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్‌ అందుబాటులో లేకుండా చేశారు బిగ్‌బాస్‌. వెయిట్‌ తగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. అందులో భాగంగా మధ్య మధ్యలో టాస్క్ లు, గేమ్‌లిస్తూ విన్‌ అయ్యే అవకాశాలిస్తున్నాడు. 
 

27

బుధవారం ఎపిసోడ్‌లో కర్రలు నరికే టాస్క్ లో ప్రియా, ప్రియాంకలతో పోటీ పడి, విశ్వ, యాంకర్‌ రవి విన్నర్‌ అయ్యారు. అదే సమయంలో నీటిలో తేలే వస్తువులేంటి? మునిగే వస్తువులేంటో గుర్తించాలని టాస్క్ ఇవ్వగా, ఇందులో సన్నీ, మానస్‌ గెలిచారు. 

37

ఇంటిసభ్యులు ఆకలి బాధలను తెలియజేసేలా ఓ చిన్న స్కిట్‌ని ప్రదర్శించారు ఇంటి సభ్యులు. అందులో భాగంగా విశ్వ, యాంకర్‌ రవి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియా కలిసి కమల్‌ హాసన్‌ నటించిన `ఆకలి రాజ్యం`లోని  శ్రీదేవి తమ రూమ్‌కి వచ్చినప్పుడు కమల్‌, తన ఫ్రెండ్స్ తో కలిసి ఆకలి బాధని దాచుకుని యాక్ట్ చేసి చూపించిన సన్నివేశాన్ని `బిగ్‌బాస్‌`లో చూపించారు. శ్రీదేవిగా ప్రియా నటించారు. 
 

47

ఈ స్కిట్‌లో విశ్వ, రవి, నటరాజ్‌ మాస్టర్‌ ఉద్యోగాల గురించి చెప్పిన విషయాలు ఆకలి బాధలను తెలియజేసిన విధానం కన్నీళ్లు పెట్టించాయి. హైలైట్‌గా నిలిచాయి. ప్రియా సైతం కన్నీళ్లు పెట్టుకుంది. ఈ స్కిట్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నారు బిగ్‌బాస్‌ సభ్యులు. 
 

57

మరోవైపు ఫుడ్‌ కోసం లోబో పడ్డా కష్టాలు, ఆకలిని తట్టుకోలేక తను పడ్డ ఇబ్బందులు సైతం గుండె తరుక్కుపోయేలా చేసింది. లోబో కిచెన్‌లో ఎవరూ చూడని సమయంలో డస్ట్ బిన్‌ కవర్‌ని చూస్తూ అందులో ఫుడ్‌ దొరుకుతుందేమో అని చేసిన ప్రయత్నం కలచి వేస్తుంది. 

67

అయితే మధ్యలో ఇంటి సభ్యుల కోసం బిగ్‌బాస్‌ బిర్యానీ పంపించాడు. దీంతో షణ్ముఖ్‌, సన్నీ, సిరి, మానస్‌, యాంకర్ రవి, నటరాజ్‌ మాస్టర్‌, శ్రీరామ్‌, హమీద ఫుడ్‌ తినలేదు. కానీ మినహా మిగిలిన వాళ్లు బిర్యానీని కుమ్మేశారు. 
 

77

ఇదిలా ఉంటే టాస్క్‌ ప్రారంభానికి ముందు ఇంట్లోని ఫుడ్‌ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్‌ తన ఆదేశాలను సక్రమంగా నిర్వహించలేదని ఫైర్‌ అవుతూ కెప్టెన్‌ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్‌ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. అంతేకాదు జెస్సీ కెప్టెన్‌ గా కొనసాగే అర్హత లేదని, ఆ స్థానం కాజల్‌ తీసుకోవాలని చెప్పారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?
Recommended image2
Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్.. ఒక్కటే మాటలో.. ఏం చెప్పిందంటే?
Recommended image3
బెస్ట్ 5 మోటివేషనల్ సినిమాలు.. ఈ సమ్మర్‌లో మీ పిల్ల‌లతో క‌చ్చితంగా క‌లిసి చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved