- Home
- Entertainment
- ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ హల్దీ ఫంక్షన్.. హాజరైన నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ హల్దీ ఫంక్షన్.. హాజరైన నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్
కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలిన లవ్ బర్డ్స్ ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గాల్రానీ పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. గతంలో గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా పూర్తవగా.. తాజాగా హల్దీ ఫంక్షన్ తో వీరి వెడ్డింగ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి.

రెండేళ్లుగా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆది పినిశెట్టి మరియు నిక్కీ గల్రానీ వారి కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితుల సమక్షంలో మార్చిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా హల్దీ ఫంక్షన్‌తో ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమ సన్నిహితులతో కలిసి హల్దీ వేడుకకు వెడ్డింగ్ వేర్ లో హాజరయ్యారు నూతన వధూవరులు.
వీరి వివాహ వేడుకలను తమిళ్, టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని మరియు సందీప్ కిషన్ హల్దీ ఫంక్షన్‌లకు హాజరయ్యారు. ఈ శుభ సందర్భంగా వారు డాన్స్ కూడా వేడుకల్లో మరింత జోష్ పెంచారు.
ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ వివాహ వేడుకలను చెన్నైలో గ్రాండ్ నిర్వహించారు. సినీ ప్రముఖులు స్టార్స్ వెడ్డింగ్ కు హాజరై ఆశీర్వదిస్తున్నారు.
ఫేమస్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. విభిన్న పాత్రల్లో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
మలయాళ హీరోయిన్ నిక్కీ గాల్రానీ (Nikki Galrani) ఆది పినిశెట్టి ఇద్దరూ తమిళం చిత్రం ‘యాగవరాయినుమ్ నా కాక్క’, తెలుగులో ‘మలుపు’ సినిమాలో కలిసి నటించారు. అప్పటికే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమ ప్రస్తుతం పెళ్లి పీటల వరకు వచ్చింది. ఈ స్టార్ కపుల్ ఒక్కటవుతున్నందుకు వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.