- Home
- Entertainment
- AK 47: ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా, అసలు కారణం ఏంటంటే?.. కొత్త రిలీజ్ డేట్ ఇదే, నిరాశలో వెంకీ అభిమానులు
AK 47: ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా, అసలు కారణం ఏంటంటే?.. కొత్త రిలీజ్ డేట్ ఇదే, నిరాశలో వెంకీ అభిమానులు
AK 47 Postponed:వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి సినిమా `ఆదర్శ కుటుంబం`. ఈ చిత్రం వాయిదా పడింది. దానికి కారణాలు ఏంటి? కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చూస్తే.

ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (హౌజ్ నెంబర్ 47). త్రివిక్రమ్ దర్శకత్వంలో కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వెంకటేష్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రేపు అక్టోబర్ 6న ట్రైలర్ రిలీజ్ కూడా అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు సమాచారం. ముందుగా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించగా.. ఇప్పుడు అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ అభిమానులకు నిరాశ
వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, వినోదం కలగలిపిన కథల్లో వెంకటేష్ నటనకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లని తీయడంలో దిట్ట. ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రిలీజ్ డేట్ మారడం కొంత నిరాశ కలిగించే విషయమే. నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ఇతర సినిమాలతో పోటీ వంటి అంశాలు విడుదల తేదీ మారడానికి కారణమై ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
ఆదర్శ కుటుంబం వాయిదాకి కారణమిదేనా?
ఇదిలా ఉంటే సినిమా వాయిదాకి మరికొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. సినిమాకి బజ్ రావడం లేదు. వరుసగా టీమ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, అంతగా హైప్ రావడం లేదు. దీనికితోడు ఆ నెక్ట్స్ వారం విజయ్ దేవరకొండ `రణబాలి`(అక్టోబర్ 17) ఉంది. అలాగే రజనీకాంత్ `జైలర్ 2`(అక్టోబర్ 15) రిలీజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏకే 47 మూవీకి రిలీజ్ తర్వాత పెద్దగా గ్యాప్ లేదు. కేవలం ఆరు రోజులే ఉంటాయి. పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో కలెక్షన్ల రికవరీకి టైమ్ కావాలి. కేవలం ఆరు రోజుల్లో అది సాధించడం కష్టం. పైగా నెగటివ్ టాక్ వస్తే సినిమా కిల్ అవుతుంది. అంతేకాదు `జైలర్ 2` తెలుగు రిలీజ్ కూడా నాగవంశీనే చేస్తున్నారు. రెండు సినిమాలు వారివే అయితే బాక్సాఫీసు వద్ద వారికే నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. దీనికితోడు బెటర్‌గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికి వీలుంటుందని ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై నిర్మాత నాగవంశీ మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు.
ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
అక్టోబర్ 30న సినిమా విడుదలైతే దసరా సీజన్ తర్వాత కూడా మంచి థియేట్రికల్ రన్ దక్కే అవకాశం ఉంటుంది. వెంకటేష్ మార్కెట్, ఫ్యామిలీ ఆడియన్స్ బలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు ఆ వచ్చే వారమే దీపావళి ఉంటుంది. ఆ సెలవులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పైగా దీపావళి పండక్కి పెద్దగా సినిమాలు లేవు. అది `ఏకే 47` మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని వాయిదా వేసినట్టు సమాచారం. ఇక ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? కథలో కుటుంబ బంధాలను ఎలా చూపించబోతున్నారు? ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 30నైనా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, డింపుల్ హయతి, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నారా రోహిత్ మరో ముఖ్య పాత్ర చేస్తున్నారు. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

