MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ బర్త్ డేకు సర్ ప్రైజ్ లు.. ‘ప్రాజెక్ట్ కే’, ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్డేట్స్.!

ప్రభాస్ బర్త్ డేకు సర్ ప్రైజ్ లు.. ‘ప్రాజెక్ట్ కే’, ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్డేట్స్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో నెల రోజుల్లో డార్లింగ్ పుట్టిన రోజు ఉండటంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు మేకర్స్ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టిన రోజుకు ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ సిద్ధమవుతున్నారు డార్లింగ్ అభిమానులు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల నుంచి కూడా అదిరిపోయే అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది.

27

చివరిగా ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం ఫ్యాన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పై మరింత శ్రద్ధ పెట్టారు ప్రభాస్. ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కే’ (Project K) సినిమాలను రూపొందిస్తున్నారు. 

37

ఈ క్రమంలో పెద్దనాన్న క్రిష్ణం రాజు మరణం కూడా ప్రభాస్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా అభిమానులను, దర్శక నిర్మాతలను డిజపాయింట్ చేయకుండా.. సినిమాపై తనకున్న గౌరవంతో రీసెంట్ గా ‘సలార్’ షూటింగ్ ను పునఃప్రారంభించారు. దీనికి పార్లల్ గా ‘ప్రాజెక్ట్ కే’ చిత్రీకరణను కూడా కొనసాగించారు. మున్ముందు మళ్లీ షూట్ ప్రారంభించనున్నారు.
 

47

అయితే ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birthday)కు సరిగ్గా నెలరోజులు ఉండటంతో మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ లను  ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట క్రేజీగా బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘ఆది పురుష్’ నుంచి అదిరిపోయే అప్డేట్స్ రావాల్సి ఉంది. కానీ డిలే అవుతూ వచ్చాయి.  
 

57

ప్రభాస్ పుట్టిన బర్త్ డే గిప్ట్ గా భారీ చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. బజ్ ప్రకారం.. ఇప్పటికే ‘సలార్’ను మతిపోయే పోస్టర్లు, రిలీజ్ డేట్ పై అప్డేట్ అందింది. ఇక ప్రస్తుతం సలార్ రియల్ ఫస్ట్ లుక్  పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం షూట్ కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 27 వరకు కొనసాగుతోంది. 

67

మరోవైపు నాగ్ అశ్విని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ప్రాజెక్ట్ కే’ నుంచి కూడా అదిరిపోయే  అప్డేట్ రానుంది. బర్త్ డే గిఫ్ట్ గా స్పెషల్ అప్డేట్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో ‘ఆదిపురుష్’ చిత్రం నుంచి కూడా ట్రైలర్ లేదా గ్లింప్స్ కూడా రానున్నట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

77

డార్లింగ్ పుట్టిన రోజుకు సరిగ్గా నెల రోజులు ఉండటంతో అభిమానులు సెలబ్రేషన్స్ ను గట్టిగా నిర్వహించాలని భావిస్తున్నారు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మించి యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. బర్త్ కు ‘బిల్లా’,‘వర్షం’ చిత్రాలను 4కే వెర్షన్ లో రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Recommended image3
Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved