MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై కొత్త ప్రయోగం.. సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై కొత్త ప్రయోగం.. సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులు అదిరిపోయే స్టెప్పుల కోసం ఎదురు చూస్తుంటారు. హీరోయిన్ తో ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కానీ కాకా సినిమాలో అవేమీ ఉండవట. ఈసినిమాపై షాకింగ్ విషయాలు వెల్లడించాడు ప్రముఖ రచయిత కోన వెంకట్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 17 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చిరంజీవి ‘కాకా’పై భారీ అంచనాలు..
Image Credit : Youtube Screenshot@KVNPRODUCTIONSOFFICIAL

చిరంజీవి ‘కాకా’పై భారీ అంచనాలు..

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం కాకా. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వాల్తేరు వీరయ్య మ్యాజిక్‌ రిపీట్!

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సక్సెస్‌ఫుల్ టీమ్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్ వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. 'మనశంకర వరప్రసాద్' సక్సెస్ తో చిరంజీవి నెక్ట్స్ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు గట్టిగా ఉన్నాయి. దాంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ స్థాయిని మరింత పెంచేలా, గత చిత్రాల కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండబోతుందని కోనా వెంకట్ అన్నారు. బాబీ బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో జోరుమీదుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ సుమారు 70 నుండి 75 శాతం పూర్తి కావచ్చినట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్ , మెగా ప్రయోగం
Image Credit : Asianet News

గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్ , మెగా ప్రయోగం

కాక సినిమా పూర్తిగా ఒక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ సినిమా అయినప్పటికీ, టీజర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కమర్షియల్ సినిమాలలో ఉండే గ్లామర్, రెగ్యులర్ హీరోయిజం కాకుండా, మెగాస్టార్ చాలా గ్రౌండెడ్ అండ్ డౌన్-టు-ఎర్త్ లుక్‌లో కనిపించడం విశేషం. చంకలో క్యాష్ బ్యాగ్‌తో ఆయన వెళ్లే తీరు, దానికి తగ్గట్టుగా వచ్చిన వింటేజ్ మ్యూజిక్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.

33
కదిరి కాళిదాస్ వర్సెస్ సత్యన్న!
Image Credit : Asianet News

కదిరి కాళిదాస్ వర్సెస్ సత్యన్న!

సినిమా టీజర్‌లో పాత్రల గురించి వస్తున్న చర్చలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీజర్‌లో 'సత్యవన్న' అని పిలవడం, అలాగే మెగాస్టార్ లీక్ చేసిన 'కదిరి కాళిదాస్' పేర్ల వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ వేర్వేరు పాత్రలా లేక ఒకే వ్యక్తి మారిన రూపామా అన్నది సినిమాలోని ట్విస్ట్ గా ఉండనుంది. ఈ కథలో అనేక లేయర్స్ ఉన్నాయని, జనవరి 13 వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుందని కోన వెంకట్ అన్నారు.

అభిమానులకు పెద్ద షాకే..

మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులు కోరుకునేది యాక్షన్ తో పాటు డ్యాన్స్ , డ్యూయోట్స్, హీరోయిన్ తో మంచి లవ్ ట్రాక్. కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవని తెలుస్తోంది. హీరోయిన్ లేకుండా, డ్యూయెట్లు, లవ్ ట్రాక్‌లు లేకుండా చిరంజీవి ఒక్కడిమీదే సినిమా కథ సాగుతుందట. మెగాస్టార్ వన్ మ్యాన్ షో చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, పవర్‌ఫుల్ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్ కలబోతగా వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image3
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Related Stories
Recommended image1
రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?
Recommended image2
90s Biscuits: పార్లే-జీ నుంచి లిటిల్ హార్ట్స్ వరకు.. 90s కిడ్స్ ఎంతో ఫేవరెట్ బిస్కెట్స్ ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved