- Home
- Entertainment
- కఠిన పరిస్థితులను ఎదుర్కొనే బలం నీప్రేమ ఇస్తుంది... శ్రీజతో విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్
కఠిన పరిస్థితులను ఎదుర్కొనే బలం నీప్రేమ ఇస్తుంది... శ్రీజతో విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. భార్య శ్రీజతో విడిపోయారంటూ వార్తలు వస్తుండగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తల్లి బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యారు.

కొన్ని నెలలుగా కళ్యాణ్ దేవ్(Kalyan dev), శ్రీజ విడివిడిగా ఉంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించారు. అంతే కాకుండా ఆయన్ని ఆమె అన్ ఫాలో చేశారు. అప్పటి నుండే శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ మధ్య కాలంలో ఒక్కసారి కూడా కళ్యాణ్ దేవ్, శ్రీజ(Sreeja) కలిసి కనిపించలేదు. గతంలో కళ్యాణ్ దేవ్ అల్లుడిగా చిరంజీవి నివాసంలో ఎక్కువగా ఉండేవారు. ఇక ఇటీవల శ్రీజ తన పెద్ద కూతురు పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ బర్త్ డే ఫొటోల్లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. అలాగే ఆయన కూతురుకు బర్త్ డే విషెష్ కూడా చెప్పలేదు.
శ్రీజ కూతురు నివృతి మొదటి భర్త సంతానం. గత ఏడాది నివృతి బర్త్ డే వేడుకలు కళ్యాణ్ దేవ్ దగ్గరుండి చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూతురిపై ప్రేమ కురిపిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈసారి అలా జరగలేదు. మరోవైపు కళ్యాణ్ దేవ్ చిత్రాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. కళ్యాణ్ దేవ్ కెరీర్ పై చిరంజీవి శ్రద్ద చూపించడం లేదు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్-శ్రీజ విడిపోయారని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అధికారిక ప్రకటన జరగనప్పటికీ ఈ టాలీవుడ్ జంట విడిపోయారన్నది నిజం అంటున్నారు. మరో వైపు శ్రీజ మూడో పెళ్లి వార్తలు వస్తున్నాయి. శ్రీజ స్నేహితుడైన ఓ వ్యక్తిని మూడో వివాహం చేసుకోవాలి అంటుకుంటున్నారని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. తల్లి బర్త్ డే నేపథ్యంలో... ఎలాంటి కఠిన పరిస్థులు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం నీ ప్రేమ అందిస్తుంది. వెనుకుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే అమ్మ... అంటూ పోస్ట్ పెట్టారు. తల్లితో కూడిన బర్త్ డే పిక్స్ షేర్ చేశారు.
Kalyan dev
ఇక కళ్యాణ్ దేవ్ ప్రస్తావించిన ఆ కఠిన పరిస్థితులు శ్రీజతో విడాకులేనా అని అంచనా వేస్తున్నారు. ఆమెతో ఎడబాటును కళ్యాణ్ దేవ్ అలా పరోక్షంగా తెలియజేశారు అంటున్నారు. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వెనుక అర్థం ఏదైనా కానీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kalyan dev
కాగా విజేత మూవీతో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. ఆ మూవీకి చిరంజీవి(Chiranjeevi) ప్రచారం కల్పించారు. దానితో ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ మూవీ సూపర్ మచ్చి.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక కళ్యాణ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కిన్నెరసాని డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. జీ5 లో విడుదల చేశారు.