Renu Desai: నన్ను తిడుతూ కొట్టేందుకు వచ్చాడు.. అందుకే అంతలా అరిచాను
Renu Desai: రేణూ దేశాయ్ పెట్టిన ప్రెస్‌మీట్లో మీడియాకు ఆమెకు మధ్య గొడవ జరిగింది. దీనిపై రేణూ దేశాయ్ వివరణ ఇచ్చింది. తాను మీడియాతో గొడవ పడలేదని, ఒక వ్యక్తితోనే గొడవ పడ్డానని ఆమె చెప్పింది.

ఎందుకలా అరిచానంటే
ప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఆమె అరుస్తూ వీడియోలో కనిపించడంతో రేణు దేశాయ్ ఎందుకలా అరుస్తోందంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె విలేకరులపై అరుస్తోందని ఎంతోమంది భావించారు. తన ఆగ్రహంపై తాను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చారు రేణూ దేశాయ్. తను ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆ సందర్భంలో ఎందుకంత కోపంగా మాట్లాడాల్సి వచ్చిందో వివరించారు. ఒక చిన్న వీడియో క్లిప్ వల్ల అసలు విషయం పక్కదారి పట్టిందని, పూర్తి సందర్భం తెలియకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఆమె బాధపడుతూ చెప్పారు.
ఒక వ్యక్తి తిట్టడం వల్లే
రేణూ దేశాయ్ చెబుతున్న ప్రకారం ఆరోజు పెట్టిన ప్రెస్ మీట్లో తాను మీడియాపై కోపంతో అరవలేదని వివరించారు. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి తనను తిట్టాడని, మీదకొచ్చి కొట్టేలా ప్రవర్తించాడని దాంతో కోపంగా అరిచాను అని తెలిపింది. అంతే తప్ప మీడియా మీద తనకు ఎలాంటి ద్వేషము లేదని వివరించింది. ఎలాంటి లాభం చూసుకోకుండా ఎన్జీవో నడుపుతున్నానని, వీలైనంత సేవ చేస్తున్నానని ఆమె చెప్పింది. మూగజీవాల కోసం పోరాడుతూ ఉంటే ఇంతగా సోషల్ మీడియాలో వ్యక్తిగత ట్రోల్స్ చేయాలా? అని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని వదిలేయడానికి ఇదే కారణమని కామెంట్లు పెట్టడం, మరికొందరు కుక్కలు కరిచి మీ పిల్లలు చనిపోతే తెలుస్తుందని కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు.
కుక్కల కోసం పోరాటం
వీధి కుక్కలను ఇష్టానుసారం చంపేయడాన్ని ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ రచ్చ మొదలైంది. ఓ సందర్భంలో రేణు దేశాయ్ పూర్తిగా సహాయం కోల్పోయినట్టు కనిపించింది. మీడియా వారితో తగువుకు దిగినట్టు అనిపించింది. గట్టిగా అరుస్తూ కుక్కల కోసం ఆమె పోరాడుతూ కనిపించారు. దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా ట్రోల్ అయ్యారు.
రాజకీయాల్లోకి వస్తే చెబుతా
ఈ రచ్చ తర్వాత రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతోందని, అందుకే ఇంత గొడవ పెట్టుకుందని కామెంట్లు వినిపించాయి. దానిపై కూడా రేణు స్పందించారు. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్నది కేవలం ప్రచారమేమని తనకి ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. తను ఏ పార్టీలో చేరనని అసలు రాజకీయాల మీద తనకు ఆసక్తి లేదని చెప్పేశారు. ఒకవేళ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే దాని గురించి అధికారికంగా ప్రకటన చేస్తానని ఆమె వివరించారు.

