‘ఆదిపురుష్’పై రూ.100 కోట్ల భారం.. ఎందుకు.? ఏం చేస్తున్నారు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో డైరెక్ట్ చేస్తున్న హిందీ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adipurush).హిందీతోపాటు తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రం ఇతర భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది.
ప్రభాస్ మరియు కృతి సనన్ (Kriti Sanon) సీతారామచంద్రుల పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రో ఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
దసరా సందర్భంగా చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ అప్డేట్స్ అభిమానులకు అంతలా ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ చాలా డిజపాయింట్ చేశాయని ఆరోపించారు. అలాగే క్యారెక్టర్లను చూపించిన తీరు కూడా సరిగా లేదని విమర్శలు వచ్చాయి.
అప్పట్లో చిత్ర టీజర్ పై గట్టిగానే ట్రోల్స్ జరిగాయి. అప్పటికే ప్రభాస్ ‘రాధ్యే శ్యామ్’తో అభిమానులకు అప్సెట్ చేశారు. దీంతో తదుపరి చిత్రాలైన ‘ఆదిపురుష్’, ‘సలార్’, ప్రాజెక్ట్ కే’లపైన ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదని భావించారు. కానీ నెక్ట్స్ విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’పై విమర్శలు రావడం పెద్ద సమస్యగా మారింది.
దీంతో ‘ఆదిపురుష్’లోని లోపాలను సరిచేసేందుకు మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. కేవలం చిత్ర యూనిట్ నుంచి అనుకున్న అవుట్ పుట్ అందకపోవడంతోనే అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పెట్టుబడితో విజువల్స్, వీఎఫ్ఎక్స్, తదితర లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం స్పెషల్ టీమ్ ను ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తోంది.
అందుకోసమే.. చిత్ర విడుదలను కూడా సమ్మర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్, పాత్రల్లోని లోపాలను సరిచేయడానికి ఇంకాస్తా సమయం పట్టడంతో పోస్ట్ పోన్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు సంక్రాంతి బరిలోకి బడా హీరోల సినిమాలు కూడా భారీ హైప్ తో వస్తుండటం విశేషం. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్నారు.