- Home
- Entertainment
- 'వీరసింహారెడ్డి' చిత్రం చూడడానికి 5 కారణాలు.. బీస్ట్ మోడ్ లో బాలయ్య, ఫ్యాన్స్ డోంట్ మిస్..
'వీరసింహారెడ్డి' చిత్రం చూడడానికి 5 కారణాలు.. బీస్ట్ మోడ్ లో బాలయ్య, ఫ్యాన్స్ డోంట్ మిస్..
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం దూసుకుపోతోంది. సినీ ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఈ చిత్రం మిస్ కాకుండా ఈ సంక్రాంతి సీజన్ లో చూడడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ : ఇది బాలయ్య స్ట్రాంగ్ జోన్. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అన్ని ఈ జోనర్ లోనే ఉన్నాయి. మరోసారి బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు తరహాలో వీరసింహారెడ్డి చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ జాతర ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అఖండ తర్వాత: మరో కారణం.. ఈ చిత్రం అఖండ తర్వాత రిలీజ్ అవుతోంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వీరసింహారెడ్డి అంతకి మించి ఉండాలని అభిమానులు కోరుకుంటారు.
గోపీచంద్ దర్శకత్వం: గోపీచంద్ మలినేని కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాల్లో కమర్షియల్ అంశాలు పర్ఫెక్ట్ మీటర్ లో ఉంటాయి. వీరసింహారెడ్డి ట్రైలర్ చూస్తుంటే పక్కా హిట్ అనే నమ్మకం ఏర్పడింది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ చేస్తున్న చిత్రం ఇది.
తమన్ : ప్రస్తుతం తమన్ తన కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ చిత్రం ఆ రేంజ్ సక్సెస్ కి కారణం తమన్ బాక్సులు పగిలేలా ఇచ్చిన బిజియం కూడా. ఇక వీరసింహారెడ్డి పాటలు అవసరమైన మేరకు రీచ్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండని మించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ : బాలకృష్ణ చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఊర మాస్ గా ఉంటాయి. వీరసింహారెడ్డి ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఇలా కనిపిస్తే బాలయ్య అభిమానులకు పూనకాలు గ్యారెంటీ.