- Home
- Entertainment
- 300కోట్ల సినిమాతో దుమ్ములేపి ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఐశ్వర్య ట్రీట్
300కోట్ల సినిమాతో దుమ్ములేపి ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఐశ్వర్య ట్రీట్
ఐశ్వర్యా రాజేష్ తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రారంభంలో ఆమె డిజప్పాయింట్ చేసింది. తను నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకి సరైన పాత్ర ఇచ్చాడు. అదరగొట్టాడు. ఆమె నటనతో అదరగొట్టేలా చేశాడు. ఐశ్వర్య రాజేష్ ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో జోడీ కట్టి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేసే పనిలో ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
aishwarya rajesh
తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. అక్కడే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా నిలబడింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది. ఇక్కడ బాగానే సినిమాలు చేసింది. నాలుగైదు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కొన్ని కీలకపాత్రలు పోషించింది. ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లిగానూ చేసింది. నటనకు ప్రయారిటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.
aishwarya rajesh
ఐశ్వర్యా రాజేష్ ఇటీవల సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేష్‌కి జోడీగా భాగ్యం పాత్రలో నటించింది. తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. దీంతో ఐశ్వర్య 300కోట్ల మూవీలో భాగమైందని చెప్పొచ్చు. ఇంతటి భారీ కలెక్షన్లని సాధించిన తన తొలి మూవీ ఇదే కావడం విశేషం.
aishwarya rajesh
సక్సెస్ జోరులో ఉన్న ఐశ్వర్య అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఆమె గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అని, వీకెండ్ ట్రీట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వయిలెట్ కలర్ కోట్ లో ఐష్ లుక్స్ చూస్తే మతిపోవాల్సిందే.
aishwarya rajesh
ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ పోస్ట్ పెడుతూ, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నిత్యం ప్రకాశించాలని, మీలా మీరు ఉండాలని పేర్కొంది. ఆమె పోస్ట్, ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.
aishwarya rajesh
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలు, ఒక కన్నడ చిత్రంలో నటిస్తుంది. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తను మాత్రం సెలక్టీవ్‌గా వెళ్తుందట. కంటెంట్ బాగున్న చిత్రాలు, తన పాత్రకు ప్రయారిటీ ఉన్న సినిమాలకు సైన్ చేస్తుందని తెలుస్తుంది.
aishwarya rajesh
ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు తమిళంతోపాటు తెలుగులోనూ మూవీస్ చేయబోతుందట. రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే కథల ఎంపిక విషయంలో మాత్రం చాలా జగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం.
read more: పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? సంచలన నిర్ణయం.. నగలన్నీ ఆయనకే
also read: కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో స్టార్ అయిపోయిన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి కాదు.. ఏకంగా తనకే పోటీ