2023లో ఓపెనింగ్ డే హయ్యేస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన పది సినిమాలు.. ప్రభాస్ దే హవా..!
2023లో భారీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చి సందడి చేశాయి. తారా స్థాయిలో అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పాయి. ఇక ఈ ఏడాది ఓపెనింగ్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన పది చిత్రాల గురించి తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం జూలై 16న విడుదలైన విషయం తెలిసిందే. ఓం రావత్ దర్శకత్వం వహించారు. టీసిరీస్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. మొదటి రోజు ఏకంగా రూ.135కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. మొదటి రోజు దుమ్ములేపినా.. సినిమా టాక్ వల్ల ఆ తర్వాత వసూళ్లు తగ్గుతూ వచ్చాయి.
రెండో స్థానంలో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (Jawan) ఉంది. ఈ చిత్రం తొలిరోజు రూ.127 కోట్లు సాధించి బాక్పాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ ఫిల్మ్స్ గా రికార్డు సెట్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో దుమ్ములేపుతోంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ లో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి నటించారు.
షారుఖ్ ఈఏడాది ప్రారంభంలో ‘పఠాన్’ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఏకంగా రూ.1050 కోట్లవరకు వసూల్ చేసింది. ఇక ఈ చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు సాధించిన రికార్డు సెట్ చేసింది. చిత్రంలో
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. 2023 జనవరి 25న విడుదలైంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మొన్నటి వరకు సందడి చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ ఆగస్టు 10న విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో దాదాపు రూ.700 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. మొదటి రోజు మాత్రం Jailer రూ.95కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది.
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2) కూడా మొదటి రోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఓపెనింగ్ డే రూ.58 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లోనూ మంచి కలెక్షన్లే అందుకుంది. చిత్రంలో విక్రమ్, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, శోభితా దూళిపాళ నటించారు.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించిన భారీ చిత్రం గదర్ 2 రీసెంట్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలై ఇప్పటి వరకు రూ.670 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక ఈచిత్రం కూడా ఓపెనింగ్ డే మంచి మార్క్ నే దాటింది. ఫస్ట్ డే ఏకంగా రూ.54 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ ఈ ఏడాది ప్రారంభం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు. లాంగ్ రన్ లో రూ.130 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓపెనింగ్ డే మాత్రం రూ.50 కోట్ల మార్క్ ను దాటింది. మొత్తం కలెక్షన్లలో ఫస్డ్ డేనే సగం వసూళ్లు రావడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ఏడాది జనవరిలో వచ్చిన బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓపెనింగ్ డే కలెక్షన్లు భారీగానే అందుకుంది. రూ.49.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. చిత్రంలో మాస్ మహారాజా కీలక పాత్ర పోషించారు. శృతిహాసన్ హీరోయిన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్ ఫిల్మ్ ‘బ్రో : ది అవతార్’. తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ.49 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించారు. థమన్ సంగీత దర్శకుడు.
తమిళ స్టార్ విజయ్ దళపతి తెలుగులో నటించిన డైరెక్ట్ ఫిల్మ్ ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకుడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. రష్మిక మందన్న కథానాయిక. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.310 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కాగా, మొదటి రోజు రూ.48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టాలీవుడ్ లోనూ విజయ్ సినిమాకు మొదటి రోజు అన్నీకోట్లు రావడం విశేషం.