MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీక్వెల్ నామ సంవత్సరంగా 2022..రెడీ అవుతున్న హిట్ సినిమాల సీక్వెల్స్

సీక్వెల్ నామ సంవత్సరంగా 2022..రెడీ అవుతున్న హిట్ సినిమాల సీక్వెల్స్

2022 సీక్వెల్ నామ సంవత్సంరగా మారిపోబోతోంది. రెండు మూడు ఏళ్లుగా పెడ్డింగ్ లో ఉన్న సినిమాల దగ్గర నుంచి.. రీసెంట్ గా తెరకెక్కుతోన్న సినిమాల వరకూ.. డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అందులో ఇంపార్టెంట్ సీక్వెల్స్ గురించి చూద్దాం.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 19 2022, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలకు సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల దగ్గర నుంచి.. చిన్న బడ్జెట్.. చిన్న హీరోల వరకూ. వర్కైట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తెరకెకక్కిస్తున్నారు. కొంత మంది మీరోలు ఈ సీక్వెల్స్ లో రికార్డ్ క్రియేట్ చేయాలి అని చూస్తుంటే... మరికొంత మంది హీరోలు.. ఈసినిమాలతో కెరీర్ కు మరో సారి బ్రేక్ వస్తుందని ఆశగా ఉన్నారు.

29

ఈ ఏడాది సీక్వెల్స్ సినిమాల జాతర బంగార్రాజు(Bangarraju)తో స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.  నాగార్జున(Nagarjuna), రమ్య కృష్ణ జంటగా.. కళ్యాన్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీనిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా రూపొందింది. ఈ సీక్వెల్ లో నాగార్జునతో పాటు నాగచైతన్య(Nagachaitanya),కృతిశెట్టి కూడా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన సినిమా..వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజులకు గాను బంగార్రాజు ఏకంగా 53 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

39

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ రూపొందించిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప: ద రైజ్. పాన్ ఇండియా లెవల్లో.. డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా.. వసూళ్ళ వర్షం కురిపించింది. సూపర్ హిట్ అయిన ఈసినిమా పస్ట్ పార్ట్ మాత్రమే రిలీజ్ అయ్యింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ పార్ట్.. పుష్ప ది రూల్.. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ చేయబోతున్నారు. కరోనా పాండమిక్ టైమ్ అయిపోగానే షూటింగ్ స్టార్ట్ చేసి...  దసరా వరకూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

49

టేకింగ్‌, ఎడిటింగ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా..  అన్నింటిలోనూ ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిన సినిమా కెజియఫ్(Kgf). కన్నడ దర్శకుడు  ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన ఈమూవీలో.. కన్నడ యంగ్ తరంగ్ యశ్(Yash) నటించారు. దేశ  వ్యాప్తంగా బాక్సాపీస్ ను ఒక ఊపు ఊపేసింది మూవీ. ఈ మూవీకి సీక్వెల్ గా కేజియఫ్ 2(Kgf-2) రిలీజ్ కు రెడీగా ఉంది. కరోనా వల్ల రెండు సార్లు..వాయిదా పడ్డ సినిమా ఏప్రిల్‌ 14, 2022న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మరి ఈసారైనా రిలీజ్ అవుతుందో..మళ్లీ పోస్టో పోన్ అవుతుందో చూడాలి.

59

వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌ తేజ్‌(Varun Tej) కలిసి నటించిన నవ్వుల సినిమా ఎఫ్‌2. 2019 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ.. అద్భుతమై రిజల్ట్ ను సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంది అని గతంలోనే ప్రకటించారు అనిల్ రావిపూడి. అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఎఫ3 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ వల్ల పిబ్రవరి 25కి రిలీజ్ డేట్ ను మార్చారు. ఇక భీమ్లా నాయక్ రిలీస్ కోసం మళ్ళీ మరోసారి రిలీజ్ ను మార్చుకుని ఏప్రిల్ 29కి చేరింది ఎఫ్3 మూవీ. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు గా నటించారు. దిల్ రాజు ఈమూవీని నిర్మించారు.

69

విశ్వక్‌సేన్‌ లీడ్ రోల్ చేసిన    సినిమా  హిట్‌(Hit). అనుకోకుండా సూపర్ హిట్ అయిన ఈమూవీ బాక్సాఫీస్‌  దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. నేచురల్ స్టార్ నానీ నిర్మించిన ఈమూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. ఈ సినిమాకు సీక్వెల్ గా హిట్ 2ను నిర్మిస్తున్నారు ఇప్పుడు. అంతే కాదు బాలీవుడ్ లో రీమేక్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్(Bollywood) రీమేక్ కు కూడా శైలేషే డైరెక్ట్ చేస్తున్నారు. ఇక హిట్ సీక్వెల్ హిట్ 2 ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. అయితే ఇందులో అడవి శేష్(Adivi sesh) కృష్ణ దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు.

79

యంగ్ హీరో నిఖిల్‌(Nikhil) కెరీర్‌ను మలుపు తిప్పిన  సినిమాల్లో కార్తికేయ కూడా ఒకటి. మిస్టరీ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో  చందూ మొండేటి రూపొందించిన ఈమూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కార్తికేయ2’ రాబోతోంది. ఇప్పటికే కొంత భాగం వరకూ కార్తికేయ2 షూటింగ్ అయిపోయింది. మిగిలిన షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా సినిమా కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలి అని చూస్తున్నారు. అసలే ఫెయిల్యూర్స్ లో ఉన్న నిఖిల్.. ఈ సీక్వెల్ మూవీతో అయినా.. మళ్ళీ బ్రేక్ వస్తుందేమో  అని చూస్తున్నాడు.

89

అడవి శేష్‌(Adivi Sesh) హీరోగా నటించిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ గూఢచారి. 2018లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి2’ రాబోతోంది. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడో ప్రకటించినా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు అడవి శేష్‌  మేజర్‌, హిట్‌2 సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. దాంతో ఈ సినిమా డిలే అయ్యింది. కాని ఎట్టి పరిస్థితులో గూఢచారి2 ఈ ఏడాది తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

99

వరుస సక్సెస్ లతో..స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. ఆయన కెరీర్ గ్రాఫ్ ను పెంచిన సినిమాల్లో.. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా చేసిన ఢీ మూవీ కూడా ఉంది. కామెడీ  ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈమూవీకి కోనసాగింపుగా ఢీ అండ్ డీ డబుల్ డోస్ మూవీని తెరకెక్కించబోతున్నారు. త్వరలో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మళ్లీ అదే మ్యాజిక్ రిపిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు టీమ్.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Recommended image2
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved