- Home
- Entertainment
- 2021 Highest Grossing movies:పవన్, బాలయ్యకు సాలిడ్ కమ్ బ్యాక్... 2021 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే!
2021 Highest Grossing movies:పవన్, బాలయ్యకు సాలిడ్ కమ్ బ్యాక్... 2021 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే!
చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ కేవలం రెండు శాతం. అంటే వంద సినిమాలు విడుదలైతే రెండు సినిమాలు మాత్రమే విజయం సాధిస్తాయి. అందుకే సినిమా అనేది కళాత్మక వ్యాపారం అలాగే జూదంతో సమానం. ఇలాంటి చిత్ర పరిశ్రమను కరోనా సంక్షోభంలోకి నెట్టివేసింది.

2020 కరోనా ఇయర్ గా మిగిలిపోగా... అతికొద్ది సినిమాలు మాత్ర్రమే విడుదల కావడం జరిగింది. సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. 2021లో కరోనా తగ్గుముఖం పట్టగా.. పరిశ్రమ పుంజుకుంది. పవన్, రవితేజ బాలకృష్ణ వంటి స్టార్స్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు అద్భుతమైన విజయాలు అందుకున్నారు. కొన్ని చిన్న చిత్రాలుగా విడుదలై అతిపెద్ద విజయాలు నమోదు చేశాయి. 2021 టాలీవుడ్ ప్రోగ్రెస్ కార్డ్ పరిశీలిస్తే.. విజయం సాధించిన జాబితాలో నిలిచిన చిత్రాలు ఇవే..
2021లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో వకీల్ సాబ్ (Vakeel saab)అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. పాలిటిక్స్ కారణంగా సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)2018 అజ్ఞాతవాసి తర్వాత చిత్ర్రాలు చేయలేదు. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపించింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్ మూవీ రూ. 137 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
2021లో కమ్ బ్యాక్ అయిన మరొక స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna). ఎన్టీఆర్ బయోపిక్స్, రూలర్ వంటి వరుస పరాజయాలతో సతమతమైన బాలకృష్ణ అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ... హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు దాటేసింది. అలాగే యూఎస్ లో $ 1 మిలియన్ డాలర్ వసూళ్లకు చేరుకుంది. ఇంకా విజయపథంలో దూసుకెళుతున్న అఖండ (Akhanda) టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి వకీల్ సాబ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది.
మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రంతోనే మ్యాజిక్ చేశాడు. భారీ విజయం అందుకొని వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేశాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ 'ఉప్పెన' వసూళ్ల సునామీ సృష్టించింది. హీరోయిన్ కృతి శెట్టి గ్లామర్, దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు విజయ్ సేతుపతి విలనిజం మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఉప్పెన రూ. 83 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించింది.
సీమటపాకాయ్ లా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆటం బాంబులా పేలింది జాతిరత్నాలు మూవీ. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. డెబ్యూ డైరెక్టర్ అనుదీప్ తన టేకింగ్, డైలాగ్స్ తో నవ్వులు పూయించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు మూవీ రూ. 70 కోట్లు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు అందుకుంది.
అత్యంత ప్రతికూలతల మధ్య విడుదలైన చిత్రం క్రాక్ (Krack). 2021 జనవరి 9న విడుదల కాగా... ఇంకా కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉంది. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది క్రాక్. రవితేజ మరోమారు పోలీస్ రోల్ చేయగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 35కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన క్రాక్ రూ. 60కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.
Shekar kammula, lovestory
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)-సాయి పల్లవి (Sai Pallavi)వెండితెరపై మ్యాజిక్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ క్లీన్ హిట్ గా నిలిచింది. క్యాస్ట్, లైంగిక వేధింపులు వంటి సున్నితమైన అంశాలను తీసుకొని ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెరకెక్కించారు. చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. లవ్ స్టోరీ రన్ ముగిసేనాటికి దాదాపు రూ. 59 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
2021 అక్కినేని వారసులకు కలిసొచ్చింది. చైతూ లవ్ స్టోరీ మూవీతో హిట్ అందుకోగా... అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో కెరీర్ లో మొదటి హిట్ అందుకున్న అఖిల్... పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూజా హెగ్డే అఖిల్ తో జతకట్టారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూ. 50కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుంది.
ఇక 2021లో పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa), నాని శ్యామ్ సింగరాయ్ విడుదల కానున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు ఈ లిస్ట్ లో ఏ స్థానాన్ని దక్కించుకుంటాయో చూడాలి. పుష్ప 2021 హైయెస్ట్ గ్రాసర్ గా టాప్ పొజిషన్ రాబడుతుందని ఫ్యాన్స్ గట్టి విశ్వాసంతో ఉన్నారు.
Also read `ఆర్‌ఆర్‌ఆర్`, `పుష్ప` మధ్యలో సాండ్‌విచ్ అయిపోతుంది..`శ్యామ్ సింగరాయ్`పై నాని షాకింగ్ కామెంట్
Also read BALAYYA-RAJAMOULI : బాలయ్యతో రాజమౌళి..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్