సంక్రాంతికి సై : మొదట బన్ని, తర్వాత మహేష్

First Published 7, Sep 2019, 3:33 PM IST

ప్రతీ పెద్ద ప్రొడ్యూసర్ తన సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే సంక్రాంతి పెద్ద పండగ కావటం, వరసపెట్టి శెలవలు ఉండటం కలిసి వస్తుంది. అయితే అదే సమయంలో అందరూ పెద్ద సినిమాలతో వస్తే థియోటర్స్ సమస్య వస్తుంది. కాబట్టి ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నట్లుగా తమ సినిమా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించేస్తూంటారు దర్శక,నిర్మాతలు. అలా వచ్చే 2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తెలగువారిని పలకరించటానికి రెడీ అవుతున్నాయి.
 
అవేమిటంటే...  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్ గా ... శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 2020న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోపక్క...   మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను కూడా సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది . ఇందులో మహేశ్‌ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌లపై సంక్రాంతి 2020 అని రెండు చిత్ర టీమ్ లు  ప్రకటించాయి. అయితే, తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

కానీ...డేట్స్ వేరే:   ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 12-01-2020న బన్నీ చిత్రం, 14-01-2020న మహేష్  చిత్రాన్ని విడుదల చేయనున్నారని టాక్‌. దీంతో పెద్ద పండగకు ఇద్దరు స్టార్స్‌ మధ్య పోటీ ఓ రేంజిలో ఉండేటట్లు కనపడుతోంది. అలాగే ఈ రెండు చిత్రాల స్పెషాలిటీ ఏమిటీ అంటే...ఫన్ ఎంటర్టైనర్స్ కావటం.

స్పెషాలిటీ..  అలాగే ఈ రెండు చిత్రాల్లో మరో స్పెషాలిటీ ఏంటంటే.. 'అల వైకుంఠపురములో' టబు కీలక పాత్ర పోషిస్తుండగా, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలనాటి అందాల హీరోయిన్స్  మళ్లీ వెండితెరపై సందడి చేస్తుండటం విశేషం.

దిల్ రాజు వెర్సస్ అల్లు అరవింద్  'సరిలేరు నీకెవ్వరు'ను దిల్‌రాజు, మహేశ్‌బాబు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు.

loader