MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • 10th Class Diaries Review: టెన్త్ క్లాస్‌ డైరీస్‌ మూవీ రివ్యూ..

10th Class Diaries Review: టెన్త్ క్లాస్‌ డైరీస్‌ మూవీ రివ్యూ..

ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా నాశనం అయ్యిందనే నిజ జీవిత కథతో  రూపొందిన చిత్రం `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`. శ్రీరామ్‌, అవికా గోర్‌ జంటగా నటించారు. శుక్రవారం(జులై 1)న విడుదలైంది. . మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

Aithagoni Raju | Published : Jul 01 2022, 12:49 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

యదార్థ గాథలు ఎప్పుడూ హృదయాన్ని హత్తుకునేలా, ఎంతో భావోద్వేగంగా ఉంటాయి. అలాంటి కథలతో వచ్చే సినిమాలు కత్తిమీద సాములాంటివే. ఏమాత్రం అటూ ఇటు అయినా తేడా కొడుతుంటాయి. ఎంత జాగ్రత్తగా డీల్‌ చేస్తే అంతగా ఆకట్టుకుంటుంది. అలాంటి కథతోనే వచ్చిన చిత్రం `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`. ప్రేమ కారణంగా ఓ అమ్మాయి జీవితం ఎలా నాశనం అయిపోయిందనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు అంజి. `గరుడవేగ` కి కెమెరామెన్‌గా పనిచేసిన ఆయన `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`తో దర్శకుడిగా మారారు. ఇందులో శ్రీరామ్‌, అవికా గోర్‌ జంటగా నటించారు. ఎస్‌ ఆర్‌  మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం(జులై 1)న విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో (!0th Class Diaries Review) తెలుసుకుందాం. 
 

27
Asianet Image

కథః 
సోము(శ్రీరామ్‌) బాగా చదువుకుని అమెరికాలో సెటిల్‌ అవుతాడు. డబ్బు, లగ్జరీ, అమ్మాయిలు అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో ఏడో మిస్సింగ్‌. ఆనందం లేదు. దీంతో కట్టుకున్న భార్య కూడా వదిలేస్తుంది. తాను మిస్‌ అవుతున్న ఆనందం ఏంటి?, ఆ ఆనందం ఎక్కడుంది? ఎలా వస్తుందనే వెతికే క్రమంలో స్కూల్‌ టైమ్‌లో తాను ప్రేమించిన ఫస్ట్ లవ్‌ చాందిని దగ్గరుందని తెలుసుకుంటాడు. తన ఆనందం కోసం, జీవితంలో సంతృప్తి కలగాలంటే ఆ అమ్మాయిని కలవాలని, మళ్లీ ఆ అమ్మాయికి దగ్గరవ్వాలని బయలు దేరుతారు. అందుకు రీయూనియన్‌ సాకుగా మలుచుకుంటాడు. కానీ రీ యూనియన్‌కి తన చాందిని మాత్రమే హాజరు కాదు. మరి ఆమె రాకపోవడానికి కారణమేంటి? సోము, చాందిని స్కూల్‌ లవ్‌ స్టోరీ ఏంటి? వాళ్లిద్దరు ఎలా విడిపోయారు? ప్రస్తుతం చాందిని ఎలా ఉంది? ఏం జరిగిందనేది మిగిలిన కథ. 10th Class Diaries Movie Review.

37
Asianet Image

విశ్లేషణః 
`టెన్త్ క్లాస్‌ డైరీస్‌` సినిమా నిర్మాత రామారావు లైఫ్‌లో తాను చూసిన రియల్‌ ఇన్స్ డెన్స్ ఆధారమే ఈ సినిమా కథ. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాయనేది ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నారు. అందుకు `గరుడవేగ` అంజిని దర్శకుడిగా ఎంచుకున్నారు. కథే సినిమాకి ప్రధాన బలం. అదే ప్రాణం. దాన్ని కరెక్ట్ గా తీస్తే సక్సెస్‌ పక్కా. ఆ విషయంలో దర్శకుడు, నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం. సినిమా చూస్తుంటే `త్రీ ఇడియట్స్`, `96`(జాను), `నా ఆటోగ్రాఫ్‌` వంటి చిత్రాలు గుర్తుకొస్తుంటాయి. ఫస్టాఫ్‌ హీరో తన ఆనందాన్ని, తన ప్రేమతో వెతికే అంశాలతో నడిపించారు. అందులో భాగంగా రీయూనియన్‌ అనేది ఎంచుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ కాస్త రొటీన్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. అందులో పెద్దగా కొత్తదనం లేదనిపిస్తుంది. 10th Class Diaries Movie Review.

47
Asianet Image

కానీ హీరో ఫ్రెండ్స్ గా చేసిన గౌరవ్‌(నిర్మాత రామారావు), ఆఫ్‌బాయ్‌(శ్రీనివాస్‌ రెడ్డి)లు చేసే కామెడీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. బోర్‌ ఫీలింగ్‌ని డైవర్ట్ చేస్తుంటాయి. ఫస్టాఫ్‌ అంతా ఫన్నీ వేలో నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త సీరియస్‌ ట్రాక్‌లోకి తీసుకెళ్లారు. తన ప్రియురాలు చాందిని కోసం వెతికే క్రమంలో రివీల్‌ అయ్యే అసక్తికర సంఘటనలు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంటాయి. మధ్యలో కొంత ల్యాగ్‌ ఫీలింగ్‌ని కూడా తెప్పిస్తుంటాయి. అక్కడ కూడా రామారావు, శ్రీనివాస్‌ రెడ్డి పాత్రల కామెడీ సీన్లు ఊరటనిస్తుంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్‌ సినిమాకి హైలైట్‌. ఎమోషనల్‌గా సాగుతుంది. ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండటం ఆడియెన్స్ ని కదిలిస్తుంది. హృదయాన్ని బరువెక్కిస్తుంది. 
 

57
Asianet Image

ఆర్టిస్టులుః
శ్రీరామ్‌ చాలా రోజుల తర్వాత లవర్‌ బాయ్‌గా, అదే సమయంలో బిజినెస్‌ మ్యాన్‌గా, ప్రేమ కోసం తపించే పాత్రలో బాగా చేశారు. ఏజ్‌కి తగ్గ పాత్రలో నటించారు. యాక్టర్‌గా అతనిలో కాస్త ఈజ్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే అవికా గోర్‌ పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె పాత్రని పెంచితే బాగుండేది. ఆ లోటు ఆడియెన్స్ ఫీలవుతారు. హీరో ఫ్రెండ్‌గా గౌరవ్‌ పాత్రలో నిర్మాత రామారావు ఇరగదీశారు. కామెడీ టైమింగ్‌ బాగుంది. శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి నవ్వులు పూయించారు. ఇద్దరు ఉండే సీన్లు బాగా పేలాయి. చాలా రోజుల తర్వాత శ్రీనివాస్‌ రెడ్డి పాత్ర బాగా పేలిందని చెప్పొచ్చు. రీయూనియన్‌లో తాగుబోతు రమేష్‌ ఎపిసోడ్‌ కాస్త చిరాకు పుట్టిస్తుంది. మిగిలిన ఫ్రెండ్స్ గా అర్చన, హిమజ, భాను, హీరోయిన్‌ తండ్రి నాజర్‌ పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తాయి. 10th Class Diaries Movie Review.

67
Asianet Image

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. సురేష్‌ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా వరకు కథలో భాగంగా వస్తూ కథని ముందుకు తీసుకెళ్తుంటాయి. దర్శకుడే కెమెరామెన్‌. అనుభవం ఉన్న సినిమాటోగ్రాఫర్‌ కావడం, తనదే సినిమా కావడంతో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. పెద్ద సినిమా స్థాయిలో విజువల్స్ ఉండటం విశేషం. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. ఈ సినిమాకి తగ్గట్టుగా నిర్మాణం విషయంలో రాజీపడలేదనే విషయం సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఎడిటర్‌ ఇంకాస్త తన కత్తికి పదును పెట్టాల్సింది. ఫైనల్‌గా `గరుడవేగ` అంజికి దర్శకుడిగా తొలి సినిమా కావడంతో కాస్త అనుభవలేమి కనిపిస్తుంది. కానీ చాలా వరకు బాగా చేశాడు. తన కష్టం కనిపిస్తుంది. రీయూనియన్‌ ఎపిసోడ్‌,ఫస్టాఫ్‌లో ఇంకాస్త కేర్‌ తీసుకోవాల్సింది. అక్కడ చాలా సీన్లు పండలేదు. కానీ క్లైమాక్స్ ని బాగా డీల్‌ చేశాడు. సినిమా మొత్తాన్ని క్లైమాక్స్ తీసుకెళ్లిపోతుంది. 10th Class Diaries Movie Review.

77
Asianet Image

చివరగాః మొత్తంగా ఒక మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. చాలా మందికి స్కూల్‌ డేస్‌ని గుర్తు చేస్తుంది. మెమరీస్‌ని రీకలెక్ట్ చేస్తుంది.

రేటింగ్‌ః 2.75

10th Class Diaries Movie Review.

 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన  హృతిక్ రోషన్  యాక్షన్ సినిమాలు
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలు
త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు  2, ఎక్కడ చూడొచ్చంటే?
త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు 2, ఎక్కడ చూడొచ్చంటే?
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
Top Stories
India's first Bullet Train: దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఏ రూట్లో తెలుసా?
India's first Bullet Train: దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఏ రూట్లో తెలుసా?
Telangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్
Telangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్
Telugu news live updates: IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?
Telugu news live updates: IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?