'నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?'.. సుజీత్ కామెంట్స్!

First Published 10, Sep 2019, 5:00 PM

ప్రభాస్  హీరో గా సుజీత్ దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజైన చిత్రం  'సాహో'.  ఎన్నో అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం... తొలి రోజునే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 

నేరం చేసినట్లు...: 'నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం.  భారీగా ప్రేక్షకులు వచ్చి ఈ చిత్రం చూశారు. అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు'' అని సుజీత్ అన్నారు.

టార్గెట్ ఎందుకు చేస్తున్నారు : మీడియా అంతటా నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఆఖరుగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ‘నో కామెంట్స్' అని నేను చెప్పినా కూడా అది కాంట్రవర్శిగా మారిపోయింది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ ఆవేదనతో అన్నారు.

అర్దం మారిపోయి.. :  అలాగే "ఈ సినిమా చూసినవాళ్లు నచ్చితే బాగుందని చెప్పొచ్చు .. లేదంటే బాగోలేదని అనొచ్చు. కానీ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు .. ఇంటర్వ్యూల్లో నేను ఏది మాట్లాడినా దాని అర్థం ..  మారిపోయి బయటికి వస్తున్నాయి.

గుడి గురించి చెప్పలేదు: బీహార్ లో నాకు గుడికడతామని కొంతమంది అభిమానులు నాకు కాల్ చేసి చెప్పారనే విషయాన్ని నేను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలా మాటే నా నోటి వెంట రాలేదు. గొప్పలు చెప్పుకునే అలవాటు నాకూ మొదటి నుంచి లేదు. అలా చేస్తే మా అమ్మ చంపేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

అందుకే మీడియాకు దూరం : ఇక ఫ్యాన్స్  రజనీకాంత్, మమ్ముట్టి లాంటి గొప్ప గొప్ప స్టార్ల కోసం ఆలయాలు కట్టారు. అలాంటి ఆలయాల వద్ద నేను భక్తుడిని మాత్రమే. సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. సినిమాను ప్రేమించండి లేదా ద్వేషించండి. అంతే కానీ నన్ను టార్గెట్ చేయడం చేయద్దు అని సుజీత్ వాపోయారు.

సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడే.. : సినిమా సక్సెస్ అయిన విషయాన్ని  సెలబ్రేట్ చేసుకునే సమయంలో దురదృష్టవశాత్తు నేను మంచం పట్టాను. ప్రభాస్ సర్, నిర్మాతలు నాకు సపోర్టుగా ఉన్నారు. ఇపుడు నా జీవితంలో జరిగిన మంచి ఏదైనా ఉందీ అంటే అదే. విమర్శలను విన్నాక పూర్తిగా  మౌనంగా ఉండటమే మంచిది అనిపించిందని సుజీత్ వెల్లడించారు.

loader