Today Rasi Phalalu: ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 03.03.2025 సోమవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
మేష రాశి ఫలాలు
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు పనికిరావు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పిల్లల విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

వృషభ రాశి ఫలాలు
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ఆర్ధిక పరిస్థితి, వృత్తి, వ్యాపారాల్లో గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులకు అంతంతమాత్రంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి కుటుంబం సహకారం దక్కదు.

మిథున రాశి ఫలాలు
మిథున రాశి ఫలాలు
వ్యాపారంలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. అప్పుల నుంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగం అంతంత మాత్రమే. అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు వస్తాయి. చేపట్టిన పనుల్లో కష్టం తప్పా ఫలితం ఉండదు.

సింహ రాశి ఫలాలు
సింహ రాశి ఫలాలు
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంట్లో శుకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి ఫలాలు
కన్య రాశి ఫలాలు
వృథా ఖర్చులు ఎక్కువ. సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపార పరంగా కొంత నష్ట సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల కోపానికి గురికావల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల రాశి ఫలాలు
తుల రాశి ఫలాలు
అవసరానికి ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవమర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చిక రాశి ఫలాలు
దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కాస్త బాగుంటుంది. వ్యాపారాల్లో పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి.

ధనస్సు రాశి ఫలాలు
ధనస్సు రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధిస్తాయి.

మకర రాశి ఫలాలు
మకర రాశి ఫలాలు
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో చేయని పనికి నిందలు పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలగవచ్చు.

కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి ఫలాలు
పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహనయోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సాయం చేస్తారు.

మీన రాశి ఫలాలు
మీన రాశి ఫలాలు
స్ధిరాస్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

