సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.  ఈ దిన ఫలాలు 01.03.2025 వ తేదీ శనివారానికి సంబంధించినవి. 

మేష రాశి ఫలాలు

బంధువులతో గొడవలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తల్లి తరపున వెళ్లే ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం  కలుగుతుంది. చదువు విషయాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభ రాశి ఫలాలు

అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. సంతోషమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉంది. పిల్లల చదువు, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

మిధున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. మానసిక ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో  గట్టి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

సింహం రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబంలోని కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు.

కన్య  రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు దక్కుతాయి. ఆర్థిక పరమైన చిక్కుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కొత్త పనులను మొదలు పెడతారు.కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

తుల రాశి ఫలాలు

బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది.దూర ప్రయాణాలతో లాభం జరుగుతుంది.

వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి ఉద్యోగాల్లో మంచి జరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి ఫలాలు

అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక,మానసిక సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు జరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో
అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.


మకర రాశి ఫలాలు

ఉద్యోగ బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక పరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. బంధు, మిత్రులతో ఆనందంగా ఉంటారు.

కుంభ రాశి ఫలాలు

పిల్లల చదువు విషయంలో శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తిచేస్తారు.


మీన రాశి ఫలాలు

పనులు నెమ్మదిగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.