GG vs MI: ముంబై ఇండియన్స్ రికార్డుల మోత.. గుజరాత్ ను ముంచేసిన ఓవర్సీస్ ప్లేయర్లు
GG vs MI: వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. నాట్ స్కైవర్-బ్రంట్ మరోసారి హాఫ్ సెంచరీతో (57 పరుగుల) విలువైన ఇన్నింగ్స్ సహా బంతితో రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టింది.

wpl, Mumbai, wpl 2025,
GG vs MI WPL 2025 Highlights: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఇదే తొలి విజయం. నాట్ స్కైవర్-బ్రంట్ ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించింది. గుజరాత్‌ను 120 పరుగులకే పరిమితం చేయడంలో, అలాగే విజయవంతమైన ఛేజింగ్‌ను కొనసాగించడంలో ఆమె ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
wpl, wpl 2025,
గుజరాత్ ను ముంచేసిన ఓవర్సీస్ ప్లేయర్లు
వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి నుంచి ఎదురుదెబ్బలు తింటూ మ్యాచ్ ను కోల్పోయింది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ ప్లేయర్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఓవర్సీస్ ప్లేయర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. బెత్ మూనీ 1, లారా వోల్వార్డ్ట్ 4, ఆష్లీ గార్డనర్ 10, డియాండ్రా డాటలిన్ 7 పరుగులు మాత్రమే చేశారు. దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. హర్లీన్ డియోల్ 32 పరుగులు, కాశ్వీ గౌతమ్ 20 పరుగుల ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో గుజరాత్ టీమ్ అన్ని వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆమెతో పాటు బ్రంట్ 2, అమేలియా కెర్ 2, వికెట్లు పడగొట్టారు.
wpl, wpl 2025,
ఈజీగానే టార్గెట్ అందుకున్న ముంబై ఇండియన్స్
నాట్ స్కైవర్-బ్రంట్ ఆల్ రౌండ్ షో తో ముంబై ఇండియన్స్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. WPLలో గుజరాత్ జెయింట్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ముంబై తొలి విజయాన్ని అందుకుంది.
121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది, కానీ స్కైవర్-బ్రంట్ 39 బంతుల్లో 11 బౌండరీలతో 57 పరుగులు చేసి వారిని ముందుకు నడిపించారు. అమేలియా కెర్ 19 పరుగులతో ముంబై టీమ్ విజయాన్ని అందుకుంది.
గుజరాత్ జట్టు బ్యాట్స్‌మెన్లు రాణించకపోవడంతో పెద్దగా పరుగులు చేయలేదు. తమ దూకుడు ఆటను ఈ మ్యాచ్ లో కొనసాగించలేకపోయారు. అలాగే, సూపర్ బౌలింగ్ కు తోడుగా స్కైవర్-బ్రంట్ మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో ముంబై ఇండియన్స్ సులభంగానే విజయాన్ని సాధించింది.
Image Credit: WPL Website
గుజరాత్ పై తమ విన్నింగ్ ట్రాక్ ను మరింత పెంచిన ముంబై
గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ తమ అజేయ పరంపరను కొనసాగించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డాయి, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు అన్ని మ్యాచ్ లలో విజయాన్ని అందుకుంది. ఈసారి గుజరాత్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు అనిపించింది. కానీ, మళ్లీ ముంబై చేతిలో ఓటమిని తప్పించుకోలేకపోయింది.
సూపర్ బౌలింగ్ తో అదరగొట్టిన హేలీ మాధ్యూస్
ముంబై తరఫున హేలీ మాథ్యూస్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టారు. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. నాట్ స్కైవర్-బ్రంట్, అమేలియా కెర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. 121 పరుగుల లక్ష్యఛేదనలో, ఆతిథ్య జట్టు ప్రారంభంలోనే మాథ్యూస్, యాస్టికా భాటియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్లను కోల్పోయింది, కానీ స్కైవర్-బ్రంట్ సంచలనాత్మక ఆటతీరుతో ముంబై జట్టును విజయతీరాలకు నడిపించారు. ఆమె 39 బంతుల్లో 57 పరుగులు చేసింది.