- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ యజ్వేంద్ర చాహాల్‌కి షాక్ తప్పదా? ఆ ఇద్దరినీ ఆడించాలంటున్న సంజయ్ మంజ్రేకర్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ యజ్వేంద్ర చాహాల్‌కి షాక్ తప్పదా? ఆ ఇద్దరినీ ఆడించాలంటున్న సంజయ్ మంజ్రేకర్..
కొన్నేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వస్తున్న యజ్వేంద్ర చాహాల్‌కి 2021 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, చాహాల్ కావాలని సెలక్టర్లను కోరినా మెంటర్ మాహీ, రాహుల్ చాహార్ వైపు మొగ్గుచూపించడంతో అతనికి అవకాశం దక్కలేదు..

2022 టీ20 వరల్డ్ కప్‌కి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో యజ్వేంద్ర చాహాల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హానీమూన్‌కి తీసుకెళ్లినట్టు ఆస్ట్రేలియాకి తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్..
chahal-kuldeep
2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అయినా యజ్వేంద్ర చాహాల్‌కి అవకాశం దక్కుతుందా? లేదా... టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయంపై కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు..
‘ఈసారి కూడా యజ్వేంద్ర చాహాల్, టీమిండియాకి మెయిన్ స్పిన్నర్ అవుతాడని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టును బట్టి ప్లేయర్లను ఆడించాలి. ప్రత్యర్థి టీమ్‌కి స్పిన్ వీక్‌నెస్ ఉంటే యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ ఆడాలి...
Kuldeep Yadav
లేదంటే కుల్దీప్ యాదవ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే యజ్వేంద్ర చాహాల్ కంటే టెక్నికల్‌గా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఫేస్ చేయడం చాలా కష్టం. చాహాల్ వికెట్లు తీసినా ఎక్కువ పరుగులు ఇస్తాడు. కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థికి పరుగులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వికెట్లు రాబడతాడు..
టీ20ల్లో పరుగులు ఇచ్చినా వికెట్లు తీస్తే చాలు, ఎందుకంటే అక్కడ ఉండేది బౌలర్‌కి నాలుగు ఓవర్లే. వన్డేల్లో పరిస్థితి అలా ఉండదు. 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసేటప్పుడు వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో, పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా అంతే అవసరం...
Image credit: PTI
అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ కూడా ఇండియాలో వికెట్లు రాబట్టగలరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరో ఒకరికే తుది జట్టులో ఎక్కువ అవకాశం దక్కొచ్చు. ఎందుకంటే ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..