భారత క్రికెట్ కు వన్నె: యువీని వెంటాడిన దురదృష్టం

First Published 10, Jun 2019, 3:40 PM IST

భారత క్రికెట్ రంగంలో యువరాజ్ సింగ్ ను అరుదైన క్రికెటర్ గా చెప్పుకోవచ్చు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కీలకమైన ఇన్నింగ్సు ఆడి భారత్ కు విజయాన్ని అందించిన క్రికెటర్లలో యువీ ఒక్కడుగా నిలిచిపోతాడు.

బ్యాట్స్ మన్ గానే కాకుండా ఎడమ చేతివాటం బౌలర్ గా అతను భారత క్రికెట్ కు చెప్పుకోదగిన సేవలు అందించాడు. ఫీల్డింగ్ లో యువీ అద్భుతంగా రాణించాడు. తన ఫీల్డింగ్ ప్రతిభ ద్వారా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడు.

2000ల్లో అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో చూపిన ప్రదర్శనతో పంజాబ్ కు చెందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. తన బ్యాటింగ్ ద్వారా భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. దాంతో అతను సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. వెంటనే కెన్యాలో జరిగిన ఐసిసి నాకౌట్ టోర్నమెంట్ కు అతన్ని ఎంపిక చేశారు.

తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచులోనే యువరాజ్ సింగ్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచులో 80 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ దిగ్గజాలైన బ్రెట్ లీ, గ్లెన్ మెక్ గ్రాత్, జాసోన్ జిలెస్పీలను అలవోకగా ఎదుర్కున్నాడు. తొలి మ్యాచులో చాటిన సత్తాతో జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

అయితే, యువరాజ్ సింగ్ ను ప్రారంభం నుంచే దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఫిట్నెస్ సమస్యనే కాకుండా కమిట్ మెంట్ సమస్య కూడా అతనికి శాపాలుగా మారాయి. తనపై వచ్చిన విమర్శలకు అతి త్వరలోనే 2002లో జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ లో సమాధానం చెప్పాడు. ఇంగ్లాండు భారత్ ముందు 326 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ వంటివారు కూడా పెవిలియన్ చేరుకున్నారు.

ఆ స్థితిలో బ్యాటింగ్ కు దిగిన యువరాజ్ సింగ్ తానేమిటో చూపించాడు. మొహమ్మద్ కైఫ్ తో కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యువరాజ్ సింగ్ 63 బంతుల్లో 69 పరుగులు చేశాడు. కైఫ్ 87 పరుగులు చేశాడు. ఈ మ్యాచుతో యువరాజ్ సింగ్ మ్యాచును విజయంతో ముగించగలడని ధ్రువపడింది.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో కీలకమైన ఆటగాడిగా మారాడు. యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ లో సమాంతరంగా ఎదిగి వచ్చారు. ధోనీ కన్నా యువరాజ్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

ట్వంటీ20 పొట్టి క్రికెట్ లో కూడా యువరాజ్ ఓ వెలుగు వెలిగాడు. టీ20లో ఓవరులో ఆరు సిక్స్ లు బాదిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండుకు చెందిన స్టార్ట్ బ్రాడ్ వేసిన ఓవరులో ఆరు సిక్స్ లు బాదడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

2011 భారత జట్టు ఐసిసి ప్రపంచ కప్ ను గెలవడం ఓ చరిత్ర. ఈ చరిత్రను సృష్టించిన క్రికెటర్లలో ప్రథమంగా చెప్పుకోదగినవాడు యువరాజ్. అతను మ్యాన్ అఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. అయితే, ఇంతలోనే అతన్ని క్యాన్సర్ భూతం ఆవహించింది. ఏడాదికి పైగా యువరాజ్ సింగ్ చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

అయితే, యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో స్థిరంగా రాణించడంలో విఫలమయ్యాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతన్ని జట్టు నుంచి తొలగించారు. టీ20ల్లో అద్భుతమైన ఆటగాడిగా పేరు ఉన్నప్పటికీ యువరాజ్ ఐపిఎల్ మ్యాచుల్లో రాణించలేకపోయాడు. దాంతో అతను పలు జట్లకు మారుతూ వచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత పూణే వారియర్స్ తరఫున, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున, సన్ రైజర్స్ హైదరాబాదు తరపున ఆడాడు.

loader