- Home
- Sports
- Cricket
- ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ లేకుండా యువరాజ్ సింగ్ ఫ్రెండ్‌షిప్ డే విషెస్... ఆ గొడవలే కారణమా...
ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ లేకుండా యువరాజ్ సింగ్ ఫ్రెండ్‌షిప్ డే విషెస్... ఆ గొడవలే కారణమా...
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... క్రికెట్‌ను మాత్రం మరిచిపోలేదు. అందుకే స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన ఫ్రెండ్స్‌కి విషెస్ చెబుతూ, సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు యువీ.

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్... తన టీమ్ మేట్స్ దగ్గర్నుంచి క్రిస్‌గేల్, తన జూనియర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరకూ చాలామంది క్రికెటర్ల ఫోటోలను ఈ వీడియోలో జత చేశాడు యువరాజ్ సింగ్...
అయితే యువీ పోస్టు చేసిన వీడియోలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో యువీ పేరు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది...
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య స్నేహం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడేవాళ్లు. వీరిద్దరూ కలిసి కొన్ని మధురమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత జట్టుకి విజయాలను అందించారు...
ధోనీ సెంచరీ చేస్తే, యువీ సెలబ్రేట్ చేసుకునేవాడు. యువరాజ్ సింగ్, ధోనీ కలిసి చిందులు వేసేవాళ్లు, క్రీజులో అల్లరి చేసేవాళ్లు...