MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ అంటే అంత ద్వేషమా... ఫ్యాన్ మేడ్ వీడియోలో మాహీ పార్ట్‌ని కట్ చేసిన యువరాజ్ సింగ్...

ధోనీ అంటే అంత ద్వేషమా... ఫ్యాన్ మేడ్ వీడియోలో మాహీ పార్ట్‌ని కట్ చేసిన యువరాజ్ సింగ్...

క్రికెట్‌ నుంచి రాజకీయాలను వేరు చేయడం వీళ్లయ్యే పనికాదు. ఎందుకంటే పాలిటిక్స్‌లోలాగే క్రికెట్‌లో కూడా శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరు. కెరీర్‌లో ఆరంభంలో ఆప్త మిత్రులుగా ఉన్న యువరాజ్ సింగ్- మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు బద్ధ శత్రవులుగా మారిపోయారు. మాహీ గురించి తెలీదు కానీ, యువీ మాత్రం ధోనీని ద్వేషిస్తున్నాడు. దీనికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 18 2022, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

మహేంద్ర సింగ్ ధోనీ కంటే నాలుగేళ్ల ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్.. కెప్టెన్సీ మాత్రం దక్కించుకోలేకపోయాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్... ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి, విజయం సాధించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
MS Dhoni, Yuvraj Singh

MS Dhoni, Yuvraj Singh

డిసెంబర్ 12న యువరాజ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జెమ్స్ ఆఫ్ క్రికెట్’ అనే సోషల్ మీడియా పేజీ, ఓ స్పెషల్ వీడియో క్రియేట్ చేసింది. చిన్ననాటి యువరాజ్ సింగ్, ఇప్పటి యువీతో మాట్లాడితే ఎలా ఉంటుందనే థీమ్‌తో రూపొందించిన ఈ వీడియో... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

311

‘నేను క్రికెటర్‌ని అయ్యానా...’ అని చిన్ననాటి యువీ ప్రశ్నిస్తే, సెంచరీ కొట్టిన యువరాజ్ సింగ్ బ్యాటుతో ‘అవును’ అని సమాధానం ఇస్తాడు. ‘నేను ఫైటర్‌నా’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును... క్రికెట్ ప్రపంచంలో వెలుగుచూసిన బెస్ట్ ఫైటర్లలో ఒకడివి’ అంటూ సమాధానం ఇస్తాడు యువరాజ్...

411

రికార్డులు క్రియేట్ చేశానా? దేవుడిని గౌరవించానా? స్నేహితులను సంపాదించుకున్నానా? జనాలు నన్ను అభిమానిస్తున్నారా? దేశం గర్వపడేలా చేశానా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు చెబుతాడు యువరాజ్ సింగ్...

511

ఈ వీడియో ఎంతో నచ్చడంతో తన అకౌంట్‌లో పోస్ట్ చేసుకున్నాడు యువరాజ్ సింగ్. అయితే ఒరిజినల్ వీడియో 1:10 సెకన్లు ఉండగా, యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో 1:08 సెకన్లు ఉంది. అంటే 02 సెకన్ల వీడియో లెంగ్త్ తగ్గింది...

611

ఎక్కడ తగ్గిందా? అని గమనించిన ఫ్యాన్స్... ‘స్నేహితులను సంపాదించుకున్నానా?’ అనే ప్రశ్న దగ్గర తొలుత మహేంద్ర సింగ్ ధోనీ వెనకాల యువీ కూర్చొని బైక్ మీద వెళ్తున్న ఫోటో.. యువరాజ్ సింగ్ పోస్టు చేసిన వీడియో లేకపోవడం చూసి షాక్ అయ్యారు. అంటే ధోనీ నాకు ఫ్రెండ్ కాదని పరోక్షంగా హింట్ ఇస్తూ అతను ఉన్న విడిది మేరకు వీడియోను ట్రిమ్ చేసి పోస్టు చేశాడు యువరాజ్ సింగ్...

711

ధోనీని కట్ చేసిన పోస్టు చేసిన వీడియోపై మాహీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. వీడియోలో ధోనీని లేకుండా చేయగలవేమో కానీ భారత జట్టు విజయాల్లో, భారత క్రికెట్ ఫ్యాన్స్ మనస్సులో మాహీని లేకుండా చేయలేవని అంటూ కామెంట్లు చేస్తున్నారు... 

811

ఒకప్పుడు భారత జట్టుకి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎన్నో మ్యాచులను గెలిపించిన యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ.. హీరోయిన్ దీపిక పదుకొనే విషయంలో తొలిసారి గొడవ పడ్డారు. ఇద్దరూ దీపికా పదుకొనేని ఇష్టపడ్డారని, అయితే బాలీవుడ్ బ్యూటీ మాత్రం మాహీని ఇష్టపడిందని వార్తలు వచ్చాయి. 

911

జులపాల జుట్టుతో టీమిండియాలోకి వచ్చిన ధోనీ, దీపికా పదుకొనే కోసమే ఆ స్టైయిల్‌ని తీసేశాడని కూడా టాక్ వినిపించింది. అయితే యువరాజ్ కూడా, దీపికాని ఇష్టపడుతున్నాడని తెలిసి, మాహీ తప్పుకున్నాడని అంటారు... ఇంతకుముందు కిమ్ శర్మ వంటి కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన యువీ... దీపికా పదుకొనేతో కూడా లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయాడు.

1011

ఈ సంఘటన తర్వాత యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య గొడవలు మొదలయ్యాయి. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోనీ సెంచరీ చేస్తే యువీ సెలబ్రేట్ చేసుకునేవాడు. యువీ మీద కూర్చొని ధోనీ ఫోటోలకు ఫోజులు ఇచ్చేవాడు. టీమిండియా ఏ మ్యాచ్ గెలిచినా ఈ ఇద్దరు స్నేహితుల సందడి.. అల్లరి ఉండేది...

1111

అయితే ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లకే ఈ స్నేహం చెడింది. వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లకు ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండా చేసిన ధోనీ... తనకు కెప్టెన్సీ దక్కకపోవడానికి ప్రధాన కారణమని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు... 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved